Upcoming Movies: ‘ఇండియన్‌ 2’, ‘తంగలాన్‌’ ఆ ఓటీటీలోనే స్ట్రీమింగ్‌.. ఎక్కడంటే?

ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో ఈ ఏడాది విడుదల కానున్న తమిళ సినిమాల జాబితా విడుదలైంది. ‘ఇండియన్‌ 2’, ‘తంగలాన్‌’తో పాటు ఇంకేం ఉన్నాయో చూసేయండి..

Published : 17 Jan 2024 16:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ పాన్‌ ఇండియా చిత్రాలు ‘ఇండియన్‌ 2’ (భారతీయుడు 2), ‘తంగలాన్‌’ ఓటీటీ స్ట్రీమింగ్‌ వివరాలు వెల్లడయ్యాయి. థియేటర్లలో సందడి చేసిన తర్వాత ఈ క్రేజీ మూవీస్‌ ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లో స్ట్రీమింగ్‌ కానున్నాయి. ఈ ఏడాది తమ ప్లాట్‌ఫామ్‌పై రిలీజ్‌ కానున్న తెలుగు సినిమాల జాబితాను ఇప్పటికే ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్‌ తాజాగా కోలీవుడ్‌ మూవీస్‌ లిస్ట్‌ విడుదల చేసింది. కీర్తి సురేశ్‌ నటిస్తున్న ‘రివాల్వర్‌ రీటా’ (Revolver Rita), ‘కన్నివేడి’ (Kannivedi), విజయ్‌ సేతుపతి ‘మహారాజా’, శివ కార్తికేయన్‌ హీరోగా దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియస్వామి తెరకెక్కిస్తున్న #SK21 (వర్కింగ్‌ టైటిల్‌) తదితర చిత్రాలు ‘నెట్‌ఫ్లిక్స్‌’లోనే స్ట్రీమింగ్‌ కానున్నాయి. తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉండనుంది.

‘సలార్‌’, ‘దేవర’, ‘పుష్ప 2’: ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అయ్యే మూవీలేంటో తెలుసా?

సూపర్‌హిట్‌గా నిలిచిన ‘ఇండియన్‌’కు సీక్వెల్‌ అయిన ‘ఇండియన్‌ 2’ (Indian 2)పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌- దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రమిది. కాజల్‌ అగర్వాల్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సిద్ధార్థ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది. విక్రమ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘తంగలాన్‌’ (Thangalaan)పైనా అంచనాలు నెలకొన్నాయి. కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు పా.రంజిత్‌ రూపొందిస్తున్నారు. మాళవిక మోహనన్‌, పార్వతి తిరువోతు కీలక పాత్రధారులు. ఈ సినిమా ఏప్రిల్‌లో థియేటర్లలో రిలీజ్‌ కానుంది (upcoming tamil moives in netflix). టాలీవుడ్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా ప్రాజెక్టులు ‘దేవర’ (Devara), ‘పుష్ప 2’ (Pushpa 2), గతేడాది విడుదలై హిట్‌గా నిలిచిన ప్రభాస్‌ ‘సలార్‌’ ఇదే ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని