Telugu Movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీ విడుదలయ్యే చిత్రాలివే!

upcoming telugu movies: ఈ వారం అటు థియేటర్‌తో పాటు ఇటు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైన చిత్రాలు ఏంటో తెలుసా?

Updated : 08 May 2023 11:25 IST

Telugu Movies: వెండితెరపై వేసవి వినోదాల విందు కొనసాగుతోంది. ప్రతివారం సరికొత్త సినిమాలు బాక్సాఫీస్‌ను పలకరిస్తున్నాయి. మే రెండో వారంలో కూడా ఆసక్తికర చిత్రాలు సందడి చేయనున్నాయి. గతవారంలాగే ఈ వారం కూడా మిడ్‌రేంజ్‌ హీరోల సినిమాలతో పాటు, చిన్న చిత్రాలు అలరించనున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ అనువాద చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కానున్నాయి.

‘కస్టడీ’లో ఏం జరిగింది?

‘ఒకసారి న్యాయం పక్కన నిలబడి చూడు.. నీ లైఫే మారిపోతుంది’’ అంటున్నారు నాగచైతన్య (Naga Chaitanya). ఆయన హీరోగా వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రం ‘కస్టడీ’ (Custody). శ్రీనివాస చిట్టూరి నిర్మాత. కృతి శెట్టి కథానాయిక. అరవింద్‌ స్వామి ప్రతినాయకుడిగా నటించారు. శరత్‌ కుమార్‌, ప్రియమణి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మే 12న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. చైతూ ఇందులో శివ అనే నిజాయతీ గల పోలీస్‌ కానిస్టేబుల్‌గా కనిపించనున్నారు. సినిమాలో యాక్షన్‌తో పాటు ప్రేమకథకు ప్రాధాన్యమున్నట్లు ప్రచార చిత్రాన్ని తీర్చి దిద్దిన తీరును బట్టి అర్థమవుతోంది.


‘ఛత్రపతి’గా వస్తున్న సాయి శ్రీనివాస్‌

బెల్లంకొండ శ్రీనివాస్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న హిందీ చిత్రం ‘ఛత్రపతి’. వి.వి వినాయక్‌ దర్శకుడు. నుస్రత్‌ భరుచా కథానాయిక.  తెలుగులో విజయవంతమైన ప్రభాస్‌-రాజమౌళిల ‘ఛత్రపతి’ని అదే పేరుతో హిందీలో రీమేక్‌ చేశారు.  భాగ్యశ్రీ, శరద్‌ కేల్కర్‌, శివం పాటిల్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. జయంతిలాల్‌ గడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 12న ఈ సినిమా విడుదల కానుంది.


భువన విజయమ్‌ కథేంటి?

సునీల్‌ (Sunil), శ్రీనివాస్‌ రెడ్డి, వెన్నెల కిశోర్‌, ధనరాజ్‌ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘భువన విజయమ్‌’ (Bhuvana Vijayam). ఈ సినిమాతో యలమంద చరణ్‌ దర్శకుడుగా పరిచయం కానున్నారు. ‘ఒక కథానాయకుడు.. అతని కథేంటో అతనికే తెలీదు. ఒక ప్రొడ్యూసర్‌.. అతనికి జాతకాల పిచ్చి. ఒకరంటే ఒకరికి పడని ఎనిమిది మంది రచయితలు. అనుకోకుండా రైటర్‌గా మారిన ఓ దొంగ.. వీళ్ల మధ్యలో తిరుగుతున్న ఆత్మ..’ ఈ కాన్సెప్ట్‌తో సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. మే 12 ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


క్రైమ్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో..

రవి ప్రకాష్ బోడపాటి రచన-దర్శకత్వంలో, ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వర సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ది స్టోరీ ఆఫ్‌ బ్యూటిఫుల్‌ గర్ల్‌’. నిహాల్‌ కోదాటి, దృషికా చందర్‌ నాయకనాయికలుగా నటిస్తున్నారు. మధునందన్, భార్గవ పోలుదాసు, భావన దుర్గం, సమర్థ యుగ్ దేవీ నాగవల్లీ, మెహెర్ శ్రీరామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న థియేటర్‌లలో విడుదల కానుంది. లవ్, యాక్షన్‌ తో పాటు, క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమాను తీర్చిదిద్దినట్లు చిత్ర బృందం చెబుతోంది.


ప్రేమ నుంచి పెళ్లిదాకా..

శేఖర్‌ అయాన్‌ వర్మ, వైభవి రావ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘కళ్యాణమస్తు’. ఒ.సాయి దర్శకత్వం వహిస్తున్నారు. బోయపాటి రఘుబాబు నిర్మాత. మే 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రేమతో మొదలైన ఓ జంట ప్రయాణం... పెళ్లి వరకూ ఎలా సాగిందనేది తెరపైనే చూడాలన్నాయి సినీవర్గాలు.


‘మ్యూజిక్‌ స్కూల్‌’లో ఏం జరిగింది?

యామిని ఫిలింస్‌ పతాకంపై పాపారావు బియ్యాల నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘మ్యూజిక్‌ స్కూల్‌’. శ్రియ శరణ్‌, శర్మాన్‌ జోషి, షాన్‌ కీలక పాత్రలు పోషించారు. ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు.


ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌

నవదీప్‌ చూపించనున్న ‘న్యూసెన్స్‌’ ఏంటి?

నవదీప్‌ (Navdeep), బిందు మాధవి (Bindu Madhavi) కీలక పాత్రల్లో నటించిన సరికొత్త వెబ్‌సిరీస్‌ ‘న్యూసెన్స్‌’ (Newsense). శ్రీ ప్రవీణ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ వెబ్‌సిరీస్‌ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో మే 12 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. మీడియా, రాజకీయం ఇతివృత్తంగా చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.


ఆ హత్యల కథే.. ‘దహాద్‌’..

సోనాక్షి సిన్హా (Sonakshi Sinha), విజయ్‌వర్మ, గుల్షన్‌ దేవయ్య, సోహమ్‌ షా ప్రధాన పాత్రధారులుగా.. రీమా కగ్తీ, జోయా అఖ్తర్‌ తెరకెక్కించిన వెబ్‌సిరీస్‌ ‘దహాద్‌’ (Dahaad). మే 12 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. సోనాక్షికి ఇది తొలి వెబ్‌ సిరీస్‌. ఇందులో అంజలి భాటి అనే పోలీసు పాత్రలో కనిపించనుంది. పబ్లిక్‌ బాత్‌రూమ్‌లలో అనుమానాస్పదంగా చనిపోయిన కొందరు మహిళల హత్య కేసును ఛేదించడానికి అంజలి భాటి చేసిన ప్రయత్నాలు, కథలో ఊహించని మలుపులను ఇందులో ఆసక్తికరంగా చూపించనున్నారు.


నెట్‌ఫ్లిక్స్‌

  • రాయల్‌ టీన్‌: ప్రిన్సెస్‌ మార్గరెట్‌ (హాలీవుడ్) మే 11
  • ఎరినీ (హాలీవుడ్‌)మే 11
  • ది మదర్‌ (హాలీవుడ్‌) మే 12
  • క్రాటర్‌ (హాలీవుడ్) మే 12
  • బ్లాక్‌ నైట్‌ (వెబ్‌ సిరీస్‌) మే 12

అమెజాన్‌ ప్రైమ్‌

  • ఎయిర్‌ (హాలీవుడ్) మే 12

    జీ5

  • తాజ్‌: ది రీన్‌ ఆఫ్‌ రివెంజ్‌ (హిందీ సిరీస్‌-2) మే 12


డిస్నీ+హాట్‌స్టార్‌

  • ది మప్పెట్స్‌ మేహెమ్‌ (వెబ్‌సిరీస్‌) మే 10
  • స్వప్న సుందరి (తమిళ/తెలుగు) మే 12


సోనీ లివ్‌

  • ట్రాయాంగిల్‌ ఆఫ్ శాడ్‌నెస్‌ (హాలీవుడ్) మే 12

బుక్‌ మై షో

  • ఎస్సాసిన్‌ క్లబ్‌(హాలీవుడ్‌)మే 10

జియో సినిమా

  • విక్రమ్‌ వేద (హిందీ) మే12
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని