Upasana: ఆ విషయంలో చరణ్‌ని చూసి అసూయ పడుతున్నా: ఉపాసన

ఉపాసన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కుమార్తె గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Published : 08 Feb 2024 02:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రామ్‌ చరణ్‌( Ram Charan) ఉపాసన (Upasana)లు తమ ముద్దుల కుమార్తె క్లీంకార విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తనని పెంచడంలో తల్లిదండ్రులుగా బాధ్యతలు పంచుకుంటున్నామని ఉపానస ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘అమ్మ చేసే దానికంటే నాన్న ఎక్కువ చేస్తారని భావిస్తా. అందుకే ఆడపిల్లలు తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తారు. నా కూతురు విషయంలోనూ అంతే. తల్లిదండ్రులుగా ఇద్దరం మా బాధ్యతలు సమానంగా నిర్వర్తిస్తాం. అలా చేయడం చాలా బాగుంటుంది. కానీ, క్లీంకార నాన్న కూచినే. చరణ్‌ని చూడగానే తన ముఖం వెలిగిపోతుంది. చిరునవ్వులు చిందిస్తుంది. ఆ విషయంలో చరణ్‌పై నాకు అసూయ కలుగుతోంది’’ అని సరదాగా అన్నారు.

రామ్‌ చరణ్‌ రొమాంటిక్‌ సీన్స్‌ చేయడంపై  ఇలా స్పందించారు. ‘‘మేమిద్దరం రెండు వేర్వేరు ప్రపంచాల నుంచి వచ్చాం. కానీ, నాతో ఉన్న కెమిస్ట్రీ చరణ్‌కు మరొకరితో లేదు. ఆయన హీరోయిన్స్‌తో చేసే సీన్స్‌ చూసి మొదట్లో ఇబ్బంది పడ్డా. అలా చేయడం అవసరమా? అని అడిగేదాన్ని. ‘నన్ను అర్థం చేసుకో. ఇది నా వృత్తి ఇలాగే ఉంటుంది’ అని ప్రతి విషయం వివరించేవారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం’’ అని ఉపాసన తెలిపారు.

ప్రస్తుతం.. రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’లో నటిస్తున్నారు. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్నారు. కియారా కథానాయిక. ఎస్‌.జె సూర్య, సునీల్‌, శ్రీకాంత్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇది పూర్తయ్యాక ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తారు రామ్‌ చరణ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని