Varun Tej: వరుణ్‌ తేజ్‌.. ‘మట్కా’

కథానాయకుడు వరుణ్‌ తేజ్‌.. దర్శకుడు కరుణ కుమార్‌ కలయికలో ఓ పాన్‌ ఇండియా చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. మోహన్‌ చెరుకూరి, విజేందర్‌ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Updated : 28 Jul 2023 14:08 IST

కథానాయకుడు వరుణ్‌ తేజ్‌.. దర్శకుడు కరుణ కుమార్‌ కలయికలో ఓ పాన్‌ ఇండియా చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. మోహన్‌ చెరుకూరి, విజేందర్‌ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ సినిమాకి ‘మట్కా’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్‌ క్లాప్‌ కొట్టగా.. మారుతి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. దిల్‌రాజు గౌరవ దర్శకత్వం వహించారు. సురేష్‌బాబు స్క్రిప్ట్‌ అందించారు. హరీష్‌ శంకర్‌ టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘మట్కా’ అనేది ఒకరకమైన జూదం. ఈ సినిమా 1958 - 1982 మధ్య జరిగే కథగా ఉంటుంది. అప్పట్లో యావత్‌ దేశాన్ని కదిలించిన యథార్థ సంఘటనల ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇది పూర్తిగా వైజాగ్‌ నేపథ్యంలో సాగుతుంది. ఈ కథాంశానికి తగ్గట్లుగానే ఇందులో వరుణ్‌ నాలుగు భిన్నమైన గెటప్పుల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం 60వ దశకంలో వైజాగ్‌ను తలపించే భారీ వింటేజ్‌ సెట్‌ను నిర్మించనున్నాం’’  అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో నోరా ఫతేహి కీలక పాత్రతో పాటు ప్రత్యేక పాటలో సందడి చేయనుంది. నవీన్‌ చంద్ర, కిషోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌ కుమార్‌, ఛాయాగ్రహణం: ప్రియాసేత్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని