Vicky Kaushal: సల్మాన్ వ్యక్తిగత సిబ్బంది పక్కకు తోసేసిన ఘటనపై స్పందించిన విక్కీ కౌశల్‌

Vicky Kaushal: సల్మాన్‌ వ్యక్తిగత సిబ్బంది ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై విక్కీ కౌశల్‌ స్పందించాడు.

Updated : 27 May 2023 14:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డులు (ఐఫా) - 2023 మీడియా సమావేశం సందర్భంగా అగ్ర కథానాయకుడు సల్మాన్‌ వ్యక్తిగత సిబ్బంది సినీ నటుడు విక్కీ కౌశల్‌ను పక్కకు లాగిన వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో సల్మాన్‌ అభిమానులు మరొక వీడియోను సోషల్‌మీడియాలో వైరల్‌ చేస్తున్నారు.  ఆ ఘటన తర్వాత జరిగిన మరో కార్యక్రమంలో సల్మాన్‌, విక్కీ కౌశల్‌  కలిసి వేదికను పంచుకున్న వీడియోను పంచుకున్నారు. అందులో సల్మాన్‌ నేరుగా వెళ్లి, విక్కీ కౌశల్‌ను ఆలింగనం చేసుకున్నాడు. ఇరువురు పలకరించుకున్నారు.

ఈ ఘటనపై విక్కీ కౌశల్‌ కూడా స్పందించాడు. చాలాసార్లు అనవసర విషయాలు పెద్దవిగా కనపడతాయని అన్నారు. అందుకు కారణం కూడా ఏమీ ఉండదని, సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌ అవుతున్న వీడియోలో చూసినట్లు అక్కడేమీ జరగలేదన్నారు. అసలు ఈ విషయం గురించి మాట్లాడటానికి ఏమీ లేదన్నారు. ఐఫా ఈవెంట్‌లో పాల్గొన్న వారితో విక్కీకౌశల్‌ ఫొటోలు దిగుతుండగా.. అటుగా సల్మాన్‌ఖాన్‌ వచ్చారు. దీంతో ఆయన బాడీగార్డ్స్‌ విక్కీని పక్కకు తోసేశారు. మరోవైపు, విక్కీ ఏదో మాట్లాడుతున్నప్పటికీ సల్మాన్‌ ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతూ ఆ వీడియోలో కనిపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని