Nayanthara: ఆమెకు నయన్ లక్షల్లో డబ్బు ఇచ్చింది: విఘ్నేశ్ శివన్ తల్లి
నటి నయనతారను మెచ్చుకున్నారు ఆమె అత్తయ్య మీనా కుమారి. నయన్ గొప్ప వ్యక్తి అని ఆమె అన్నారు.
చెన్నై: అగ్రకథానాయిక నయనతార (Nayanthara) గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు ఆమె అత్తయ్య, విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) తల్లి మీనా కుమారి. నయన్-విఘ్నేశ్ వివాహమైన తర్వాత మొదటిసారి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. తన కోడలు ఎంతో మంచిదని మెచ్చుకున్నారు.
‘‘మా అబ్బాయి విఘ్నేశ్ విజయవంతమైన దర్శకుడు. మా కోడలు నయనతార అగ్రకథానాయిక. వాళ్లిద్దరూ ఎంతో కష్టపడి పనిచేస్తారు. నా కోడలు బంగారు. మంచి మనసు ఉన్న వ్యక్తి. ఆమె ఇంట్లో సుమారు 8 మంది సిబ్బంది ఉన్నారు. వాళ్లల్లో ఓ మహిళకు రూ.4 లక్షలు అప్పు ఉంది. దాన్ని చెల్లించేందుకు ఆమె ఎంతో కష్టపడుతోందని తెలుసుకున్న నయన్.. ఆమెకు రూ.4 లక్షలు ఇచ్చి అప్పు తీర్చేయమని చెప్పింది. ఇంట్లో పనిచేసేవాళ్లకు కూడా అంతపెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి, సాయం చేయాలంటే దయా హృదయం ఉండాలి’’ అని ఆమె అన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్న నయన్-విఘ్నేశ్ ఈ ఏడాదిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సరోగసి విధానంలో ఇటీవల కవల పిల్లలకు ఈ జంట తల్లితండ్రులైన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం
-
Movies News
Pathaan: ‘వైఆర్యఫ్ స్పై యూనివర్స్’లో ‘పఠాన్’ నంబరు 1.. కలెక్షన్ ఎంతంటే?
-
Politics News
Arvind Kejriwal: రాజకీయాల్లో ‘ఆమ్ఆద్మీ’ సక్సెస్.. ఎందుకంటే..!