Family Star: సంక్రాంతి రేస్‌ నుంచి పక్కకు జరిగిన ‘ఫ్యామిలీ స్టార్‌’.. కారణమదే

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటిస్తోన్న సరికొత్త ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star). ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడం లేదని నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) తెలిపారు.

Published : 02 Dec 2023 22:15 IST

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు (Dil Raju) నిర్మిస్తోన్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star). మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్‌కు పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది.

సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం తొలుత భావించింది. అయితే ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు తాజాగా దిల్‌రాజు ప్రకటించారు. యూఎస్‌ షెడ్యూల్‌ ఆలస్యమైందని.. అందుకే రిలీజ్‌ను వాయిదా వేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ మేరకు వచ్చే ఏడాది మార్చి నెలలో దీనిని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Social Look: ఓవర్‌ థింకింగ్‌ సీఈవో జాన్వి.. గాయాలతో కల్యాణి

అనంతరం, రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా ఆయన నిర్మిస్తోన్న ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) గురించి మాట్లాడుతూ.. ‘‘దాదాపు 80 శాతం షూటింగ్‌ పూర్తైంది. శంకర్‌ గొప్ప దర్శకుడు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో శ్రమిస్తున్నారు. సినిమా షూటింగ్‌ పూర్తైన తర్వాత రిలీజ్‌ ఎప్పుడు చేయాలనే దానిపై మేము చర్చించుకుని ఒక నిర్ణయానికి వస్తాం. ఆ తర్వాత అనౌన్స్‌ చేస్తాం’’ అన్నారు.

ఇటీవల కాలంలో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై తాము డిస్ట్రిబ్యూట్‌ చేసిన చిత్రాలన్నీ మంచి లాభాలు అందించాయని అందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ బ్యానర్‌పై విడుదలైన ‘యానిమల్‌’ తొలిరోజే రూ. 14 కోట్లు గ్రాస్‌ వసూళ్లు చేసిందన్నారు. వీకెండ్‌ నాటికి ఆ సంఖ్య దాదాపు రూ.50 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని