Vijay Deverakonda: విజయ్‌, అనన్యల కోసం నటుడి తల్లి పూజలు

తన కుమారుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), నటి అనన్యా పాండే (Ananya Pandey) కోసం నటుడి తల్లి మాధవి ప్రత్యేక పూజలు చేశారు...

Published : 17 Aug 2022 15:29 IST

ఫొటోలు షేర్‌ చేసిన రౌడీ బాయ్‌

హైదరాబాద్‌: తన కుమారుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), నటి అనన్యా పాండే (Ananya Pandey) కోసం నటుడి తల్లి మాధవి ప్రత్యేక పూజలు చేశారు. విజయ్‌ నివాసంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో విజయ్‌, అనన్య పాల్గొన్నారు. వేద పండితుల సమక్షంలో వీరిద్దరికీ మాధవి రక్ష కట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలను విజయ్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘‘ఆ దేవుడి ఆశీస్సులతోనే ఈ నెల మొత్తం దేశవ్యాప్తంగా పర్యటిస్తూ మీ ప్రేమాభిమానాన్ని పొందుతున్నానని అనుకుంటున్నా!! అయినా, ఆ దేవుడి రక్షణ మాకు ఎప్పటికీ ఉండాలని అమ్మ భావించింది..! అందుకే పూజ చేయించి, మా అందరికీ రక్ష కట్టింది. ఇక, ఆమె ప్రశాంతంగా నిద్రిస్తుంది. మేమూ మా టూర్‌ని కొనసాగించవచ్చు’’ అని విజయ్‌ రాసుకొచ్చారు.

నడుం నొప్పితో ఇబ్బందిపడుతోన్న విజయ్‌..

తన తదుపరి చిత్రం ‘లైగర్‌’ ప్రమోషన్స్‌ కోసం విజయ్‌ ఎంతో శ్రమిస్తున్నారు. వీలైనంత వరకూ తమ చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లేందుకు ‘లైగర్‌’ టీమ్‌ దేశవ్యాప్తంగా టూర్స్‌ నిర్వహిస్తోంది. దీనికోసం విజయ్‌ ఎలాంటి బ్రేక్‌ తీసుకోకుండా వరుస ఈవెంట్స్‌లో పాల్గొన్నారు. దీనివల్ల ఆయన తీవ్రమైన నడుం నొప్పితో బాధపడుతోన్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్తూ విజయ్‌ నడుంనొప్పి ఇబ్బందిపడుతోన్న ఓ వీడియోని అభిమాని షేర్‌ చేశాడు. ‘‘తీవ్రమైన నడుంనొప్పితో విజయ్‌ ఇబ్బందిపడుతోన్నట్లు ఈ వీడియో స్పష్టంగా తెలుస్తోంది. అయినా ఆయన ఫ్యాన్స్‌ మీట్‌ పెట్టి ఎంతోమందితో ఫొటోలు దిగారు. ఆయన అభిమానిగా ఉన్నందుకు గర్విస్తున్నా’’ అని పేర్కొన్నాడు. దానిపై ఛార్మి స్పందిస్తూ.. ‘‘అవును నిజమే. మీరు బాగా గుర్తించారు. దెబ్బల్ని, నొప్పిని సైతం లెక్కచేయకుండా ‘లైగర్‌’ ప్రమోషన్స్‌ కోసం విజయ్‌ రేయింబవళ్లూ వరుసగా ప్రయాణాలు చేస్తున్నాడు’’ అని చెప్పుకొచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని