Kushi Ott Release: ఓటీటీలోకి ‘ఖుషి’ చిత్రం.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటించిన ‘ఖుషి’ (Kushi Ott Release) చిత్రం ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

Updated : 24 Sep 2023 15:32 IST

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఖుషి’ (Kushi). శివ నిర్వాణ దర్శకుడు. సెప్టెంబర్‌ 1న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. కాగా, ఈ సినిమా ఓటీటీ విడుదలకు (Kushi Ott Release) రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అక్టోబర్‌ 1 నుంచి అందుబాటులో ఉండనుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఇది స్ట్రీమింగ్‌ కానుందని నెట్‌ఫ్లిక్స్‌ నేడు అధికారికంగా ప్రకటించింది. దీనిపై సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Rakshit Shetty: అతడి సంగతి నాకు తెలియదు.. నేనైతే రష్మికతో మాట్లాడుతున్నా: రక్షిత్‌శెట్టి

క‌థేంటంటే: విప్ల‌వ్ దేవ‌ర‌కొండ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) ప్ర‌భుత్వ ఉద్యోగంపై ఇష్టంతో బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌లో జేటీవోగా విధుల్లో చేరతాడు. ఏరికోరి క‌శ్మీర్‌లో పోస్ట్ వేయించుకుంటాడు. అక్క‌డే ఆరా బేగం (స‌మంత‌)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. త‌మ్ముడిని వెతుక్కుంటూ తాను పాకిస్థాన్‌ నుంచి వ‌చ్చాన‌ని చెప్పినా, త‌న కోసం పాకిస్థాన్‌ వెళ్ల‌డానికైనా సిద్ధ‌ప‌డ‌తాడు విప్ల‌వ్‌. అంత‌గా త‌న‌ని ఇష్ట‌ప‌డ‌టం చూసి... ఆ ప్రేమ‌కి ఆరా కూడా ఫిదా అయిపోతుంది. కానీ, వీళ్ల ప్రేమ‌కి పెద్ద‌లు అడ్డు చెబుతారు. భిన్న కుటుంబ నేప‌థ్యాలకి చెందిన ఈ జంట విడిపోవ‌డం ఖాయ‌మ‌ని ఇరు కుటుంబాలూ న‌మ్ముతాయి. మ‌న‌స్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. పెద్ద‌లు చెప్పిన‌ట్టే విడిపోయిందా? ఇంత‌కీ వీళ్ల కుటుంబాల క‌థేమిటి?పెళ్లి తర్వాత విప్లవ్‌, ఆరాధ్య మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి..? అనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రం సిద్ధమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని