Vikram: గుండె పోటు వార్తలపై స్పందించిన నటుడు విక్రమ్‌

ప్రముఖ నటుడు చియాన్‌ విక్రమ్‌(Vikram) ఇటీవల అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఛాతీలో ఇబ్బందిగా అనిపించడంతో

Published : 12 Jul 2022 12:52 IST

చెన్నై: ప్రముఖ నటుడు చియాన్‌ విక్రమ్‌(Vikram) ఇటీవల అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఛాతీలో ఇబ్బందిగా అనిపించడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు వచ్చిందంటూ న్యూస్‌ ఛానళ్లతో పాటు, సోషల్‌మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ వార్తలను ఆయన తనయుడు ధ్రువ్‌ ఖండించారు. తాజాగా విక్రమ్‌ కూడా స్పందించారు.

ఆయన కథానాయకుడిగా అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కోబ్రా’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చెన్నైలో నిర్వహించిన ఆడియో విడుదల వేడుకలో విక్రమ్‌ పాల్గొని మాట్లాడారు. ‘ఆ రోజు వచ్చిన వార్తలన్నింటినీ నేను చూశా. జబ్బుపడిన వ్యక్తి ఫొటోలకు నా తలను పెట్టి మార్ఫ్‌ చేశారు. ఫొటోపై నా పేరు పెడుతూ థంబ్‌ నెయిల్స్‌ క్రియేట్‌ చేశారు. వాళ్ల క్రియేటివిటీ బాగుంది. థ్యాంక్యూ. నా జీవితంలో ఇలాంటివి ఎన్నో అనుభవించా. ఇదేమీ నన్ను పెద్దగా ఆందోళనకు గురిచేయలేదు. నా కుటుంబం, స్నేహితులు, అభిమానులు నాకు అండగా నిలిచారు. ఇంతకు మించి జీవితంలో నాకేమీ వద్దు’’ అని అన్నారు. వేదికపై ఆయన ఆద్యంతం ఉత్సాహంగా మాట్లాడారు.

విక్రమ్‌ ‘కోబ్రా’లో కథానాయికగా ‘కేజీయఫ్‌’ ఫేం శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో విక్రమ్‌ ఏడు విభిన్న గెటప్‌లలో కనిపించనున్నట్లు ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతోంది. అంతేకాదు, సినిమాలో అనేక సర్‌ప్రైజ్‌లు ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది.  ఈ సినిమాతో పాటు మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లోనూ విక్రమ్‌ నటిస్తున్నారు. చోళ రాజుల కాలం నాటి కథతో భారీ బడ్జెట్‌తో  ఈ సినిమా తెరకెక్కింది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని