Balagam: ‘బలగం’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న గ్రామస్థులు

‘బలగం’ చూసి గ్రామస్థులంతా కన్నీళ్లు పెట్టుకున్న ఘటన తాజాగా తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

Updated : 02 Apr 2023 17:05 IST

హైదరాబాద్‌: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు అద్దం పడుతూ తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘బలగం’ (Balagam). చిన్న సినిమాగా విడుదలైన ఇది.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో భారీ ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పాత రోజులను గుర్తు చేస్తూ.. తెలంగాణలోని పలు పల్లెటూర్లలో ఈ సినిమాని వీధుల్లో తెరలు కట్టి ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఓ ఊరిలో ఈ చిత్రాన్ని తెర కట్టి ప్రదర్శించగా.. దానిని చూసిన గ్రామస్థులందరూ భావోద్వేగానికి గురయ్యారు. సినిమా క్లైమాక్స్‌కు వచ్చేసరికి  ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకుంటూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశాడు. ‘బలగం’ జనాల్లోకి వెళ్లిందని అన్నాడు. దీనిపై సినిమా హీరో ప్రియదర్శి  ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

‘జబర్దస్త్‌’ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న  వేణు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రియదర్శి - కావ్యా కల్యాణ్‌రామ్‌ జంటగా నటించారు. దిల్‌రాజు ప్రొడెక్షన్స్‌ పతాకంపై హన్షిత్‌, హర్షిత దీనిని నిర్మించారు. ప్రస్తుతం ఈచిత్రం థియేటర్లతోపాటు ఓటీటీలోనూ అందుబాటులో ఉంది. విడుదలైన కొన్నిరోజుల్లోనే ఇది రెండు అంతర్జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుంది. బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌, బెస్ట్‌ ఫీచర్‌ఫిల్మ్‌ సినిమాటోగ్రఫీ విభాగాల్లో లాస్‌ఏంజిల్స్‌ సినిమాటోగ్రఫీ అవార్డులను ఇది అందుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని