VBVK: ఓటీటీలోకి ‘వినరో భాగ్యము విష్ణుకథ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

కిరణ్‌ అబ్బవరం, కశ్మీరా పరదేశి జంటగా నటించిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదలకానుంది. ఎక్కడ? ఎప్పుడంటే?

Published : 15 Mar 2023 19:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 22న ఓటీటీ ‘ఆహా’ (Aha)లో విడుదలవుతుందని నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ ప్రకటించింది. కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram), కశ్మీరా పరదేశి జంటగా నటించిన ఈ సినిమాకి బాక్సాఫీసు వద్ద మంచి స్పందన లభించింది. పలు నేపథ్యాల మిళితంగా ఈ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిశోర్‌ తెరకెక్కించారు. శుభ‌లేఖ సుధాక‌ర్‌, ముర‌ళీ శ‌ర్మ‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో ఫిబ్రవరి 18న విడుదలైందీ చిత్రం.

కథేంటంటే: ‘బాగుండ‌ట‌మంటే మ‌నం బాగుండ‌టం కాదు, ప‌క్క‌వాళ్ల‌తో బాగుండ‌ట‌మే’ అని తన తాత చెప్పిన మాట‌కు క‌ట్టుబ‌డిన కుర్రాడు విష్ణు (కిర‌ణ్ అబ్బ‌వ‌రం). అత‌నిది తిరుప‌తి. హైద‌రాబాద్ సెంట్ర‌ల్ లైబ్ర‌రీలో ప‌ని చేస్తుంటాడు. సాయం చేయ‌డంలో ఎప్పుడూ ముందుండే త‌న‌కు నంబ‌ర్ నైబ‌ర్ అనే కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌న (క‌శ్మీరా) ద‌గ్గ‌ర‌వుతుంది. ఆమె ఓ యూట్యూబ‌ర్‌. త‌న యూట్యూబ్ ఛానెల్‌తో పాపులారిటీ తెచ్చుకోవాల‌న్న ల‌క్ష్యంతో నంబ‌ర్ నైబ‌ర్ కాన్సెప్ట్ ద్వారా ప‌రిచ‌య‌మైన విష్ణు, శ‌ర్మ (ముర‌ళీ శ‌ర్మ‌)ల‌తో క‌లిసి వీడియోలు చేస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే విష్ణు, శ‌ర్మ ఇద్ద‌రూ ద‌ర్శ‌న‌ను ప్రేమిస్తారు. అయితే ఆమె ఓరోజు శ‌ర్మ‌తో క‌లిసి లైవ్ మ‌ర్డ‌ర్ అనే ప్రాంక్ వీడియో చేస్తుంది. కానీ, ఆ ప్ర‌య‌త్నంలో శ‌ర్మ నిజంగానే ద‌ర్శ‌న పేల్చిన తూటాకు బ‌ల‌వుతాడు. దీంతో ఆ హ‌త్య కేసులో ద‌ర్శ‌న జైలు పాల‌వుతుంది. మ‌రి ఆ కేసు నుంచి త‌న ప్రేయ‌సిని బ‌య‌ట ప‌డేయ‌టం కోసం విష్ణు ఏం చేశాడు?  శ‌ర్మ‌ను ద‌ర్శ‌న నిజంగానే హ‌త్య చేసిందా? ఈ హ‌త్య‌కు రాజ‌కీయ నాయ‌కుడుకు ఉన్న లింకేంటి? అన్నది మిగతా కథ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని