Hit combo: మరోసారి టాలీవుడ్‌లో ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ కానుందా..!
పూరీజగన్నాధ్-రవితేజ సినిమా వస్తుందంటే టాలీవుడ్‌లో క్రేజ్ నెలకొనేది. తాజాగా మరోసారి వీరిద్దరూ కలిసి సినిమా తీయనున్నారని టాక్.
హైదరాబాద్: టాలీవుడ్‌లో క్రేజ్ ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాధ్(Puri jagannadh) ఒకరు. ఆయన భావజాలానికి కూడా ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉంటారు. ఇక మాస్‌మహారాజ్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో రవితేజ(Ravi Teja). వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఒకప్పుడు ధియేటర్లలో విజిల్స్ వేయించాయి. అయితే ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుందని అంటున్నారు ఫిల్మ్‌నగర్ జనాలు. రవితేజతో సినిమా తీశాక పూరీ ఇమేజ్, ఫ్యాన్‌ఫాలోయింగ్ ఎంతగా పెరిగాయో తెలిసిన విషయమే. తాజాగా లైగర్ సినిమాతో ఇబ్బందులు ఎదుర్కొన్న పూరీ మరోసారి ఈ కాంబినేషన్‌పై ఆశలు పెట్టుకున్నారట. అయితే పూరీ జగన్నాధ్‌తో సినిమా తీస్తానని ఇటీవల బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య చేతి నిండా సినిమాలతో బిజీగా ఉండడంతో పూరీతో సినిమా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈలోపు రవితేజతో సినిమా ప్లాన్ చేస్తున్నారట పూరీ. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: జడేజా దెబ్బ.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. ఆసీస్ స్కోరు 84/4 (36)
-
India News
Adani Group: సుప్రీంకు చేరిన ‘అదానీ’ వ్యవహారం.. రేపు విచారణ
-
Sports News
KS Bharat: రాకెట్ స్పీడ్‌తో ఇక్కడికి చేరుకోలేదు.. ద్రవిడ్ ప్రభావం చాలా ఉంది: కేఎస్ భరత్
-
Movies News
Sridevi: ‘ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్’ పేరుతో శ్రీదేవి జీవిత చరిత్ర
-
Crime News
Crime News: విషాదం.. మంటల్లో నలుగురు చిన్నారుల సజీవ దహనం
-
World News
Biden: జిన్‌పింగ్‌కు పరిమితులు తెలుసు..: బైడెన్