Vishnu Vishal: నటుడి పోస్ట్‌పై భారీగా ట్రోల్స్‌.. ‘సూపర్‌ స్టార్‌’ పదం తొలగింపు..

నటుడు విష్ణు విశాల్‌ (Vishnu Vishal) చేసిన ఓ పోస్ట్‌కు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. దీంతో ఆయన దాని క్యాప్షన్‌ను సవరించారు.

Published : 16 Nov 2023 12:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనపై వచ్చే విమర్శలు, ట్రోలింగ్‌కు ఎప్పుడూ స్పందిస్తుంటారు నటుడు విష్ణు విశాల్‌ (Vishnu Vishal). ప్రస్తుతం ఆయన అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ఎక్స్‌(ట్విటర్‌)లో చేసిన ఓ పోస్ట్‌కు భారీగా ట్రోల్స్‌ ఎదురయ్యాయి. దీంతో వెంటనే ఆ పోస్ట్‌ను సవరించారు. అసలేమైందంటే..

కమల్‌ హాసన్‌ (Kamal Haasan), ఆమిర్‌ ఖాన్‌తో కలిసి దిగిన ఫొటోను విష్ణు విశాల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘నాకెంతో ఇష్టమైన వ్యక్తులతో దిగిన ఫొటో. నాకు చాలా నచ్చింది. వీళ్లు సూపర్‌స్టార్స్‌’ అనే క్యాప్షన్‌ రాశారు. సూపర్ స్టార్‌ అనే పదాన్ని ఉపయోగించినందుకు రజనీకాంత్‌ (Rajinikanth) ఫ్యాన్స్‌ ఆ పోస్ట్‌ను విమర్శిస్తూ ట్రోల్స్ మొదలుపెట్టారు. దీంతో ఆయన ఆ పదాన్ని తొలగించారు. సూపర్‌ స్టార్స్‌ బదులు స్టార్స్‌ అని రాశారు. ఆ తర్వాత దానికి వివరణ ఇస్తూ మరో పోస్ట్ చేశారు. ‘పాత పోస్ట్‌ను సవరించినంత మాత్రన నేను బలహీనపడినట్లు, భయపడినట్లు కాదు. సూపర్‌స్టార్స్‌గా ఉన్న ప్రతి ఒక్కరినీ నేను అభిమానిస్తాను. మీరందరూ నా పోస్ట్‌కు ఎన్ని ప్రతికూల కామెంట్స్‌ పెట్టినా నేను వాటిని పట్టించుకోను. సూపర్‌స్టార్‌ అనే బిరుదు ఒక్కటే ఉంటుంది. కానీ, నా దృష్టిలో గొప్పవారంతా సూపర్‌స్టార్స్‌తో సమానమే. అందరినీ అభిమానించండి. వీలైతే ప్రేమను పంచండి. ద్వేషాన్ని కాదు’ అని వివరణ ఇచ్చారు.

కోహ్లీ బయోపిక్‌.. హీరో ఎవరైతే బాగుంటుందో చెప్పిన రణ్‌బీర్‌

ఇక రజనీకాంత్ (Rajinikanth) హీరోగా ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన ‘లాల్‌ సలామ్‌’(Lal Salaam)లో విష్ణు విశాల్ ఓ కీలకపాత్రను పోషించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని