Project K: ‘ప్రాజెక్ట్‌ కె’.. ప్రభాస్‌ ఫస్ట్‌లుక్‌ అదిరింది

ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న సినిమాల్లో ‘ప్రాజెక్ట్‌ కె’ (Project K) ఒకటి. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్నఈ మూవీలోని ఆయన ఫస్ట్‌ లుక్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. 

Updated : 19 Jul 2023 15:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘ప్రాజెక్ట్‌ కె’ (Project K). ఈ సినిమాలో ప్రభాస్‌ ఎలా కనిపిస్తాడో అంటూ... సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పటికే దీపికా పదుకొణె (Deepika Padukone) లుక్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన మేకర్స్‌.. తాజాగా ప్రభాస్‌ లుక్‌ను విడుదల చేశారు. సూపర్‌ హీరోలా డిజైన్‌ చేసిన ప్రభాస్‌ లుక్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

‘ప్రాజెక్ట్‌ కె’.. దీపికా పదుకొణె ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది

మరోవైపు అమెరికాలో ‘ప్రాజెక్ట్‌ కె’ సందడి మొదలైంది. కామిక్‌ కాన్‌ వేదికపై ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించనున్న తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించనుంది. ప్రతిష్ఠాత్మకమైన ‘శాన్‌ డియాగో కామిక్ కాన్‌’ ఈవెంట్లో (Comic-Con) చిత్ర బృందం పాల్గొంటుంది. ఇప్పటికే ప్రభాస్‌, రానా (Rana Daggubati), కమల్ హాసన్‌ (Kamal Haasan)అక్కడకు చేరుకున్నారు. బుధవారం దీపికా పదుకొణె, అమితాబ్‌ బచ్చన్‌ వెళ్లనున్నారు. అదే వేదికపై టైటిల్‌, ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమా రిలీజ్‌ డేట్‌పై స్పష్టతనివ్వనున్నారు. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో దిశా పటానీ కనిపించనున్నారు. ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని