Ponniyin Selvan: నాకు మణిరత్నం స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు: త్రిష

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. ఈ సినిమాలో త్రిష కుందవై అనే యువరాణి పాత్రలో, ఐశ్వర్య రాయ్‌ నందిని పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Published : 28 Sep 2022 15:48 IST

హైదరాబాద్‌: మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. ఈ సినిమాలో త్రిష కుందవై అనే యువరాణి పాత్రలో, ఐశ్వర్య రాయ్‌ నందిని పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పొన్నియిన్‌ సెట్లో జరిగిన సరదా సన్నివేశాన్ని త్రిష ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. దర్శకుడు మణిరత్నం తనకు ఇచ్చిన స్వీట్‌ వార్నింగ్ గురించి చెప్పారు. ఐశ్వర్యతో త్రిష సెల్ఫీ తీసుకుంటుంటే ‘మీరిద్దరూ అలా ఉండద్దు, ఐశ్వర్యతో అలా మాట్లాడకు’ అని చెప్పారట. ‘‘నేను, ఐశ్వర్య మంచి స్నేహితులం. సెట్‌లో ఎప్పుడూ కబుర్లు చెప్పుకుంటూ సందడిగా ఉండేవాళ్లం. ఒకరోజు షూటింగ్‌లో చాలా ముఖ్యమైన సన్నివేశం జరుగుతోంది. మణిరత్నం మా ముందు నుంచి వెళ్తు... మీరిద్దరూ ఇంత స్నేహంగా ఉండద్దు. ఐశ్వర్యతో మాట్లాడకు. ఎందుకంటే ఇప్పుడు సీన్‌లో మీరిద్దరూ ఒకరినొకరు ద్వేషించుకోవాలి’’ అని స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారని నవ్వూతూ చెప్పింది త్రిష.

ఇక తాజాగా వైరల్‌ అయిన తన ఫొటో గురించి మాట్లాడుతూ..‘‘ ఈ రోజుల్లో ఏది వైరల్‌ అవుతుందో ఊహించ లేకపోతున్నాం. నేను షేర్‌ చేసిన ఫొటోని 6 లక్షల మంది లైక్‌ చేశారు. నిజం చెప్పాలంటే ఆ ఫొటో వైరల్‌ అయినందుకు ఆనందిస్తున్నా. ఎందుకంటే అలా సినిమాలో ఫొటోలు వైరల్‌ అయితే సినిమాపై అంచనాలు పెరుగుతాయి.’’ అన్నారు. భారీ తారాగణంతో తెరకెక్కనున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని