The Warrior: రామ్‌ ‘వారియర్‌’.. ‘విజిల్‌ సాంగ్‌’ అదిరింది!

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్, అందాల భామ కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘వారియర్‌’. లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతమందించారు.

Published : 23 Jun 2022 01:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్ (Ram Pothineni), అందాల భామ కృతిశెట్టి (Krithi Shetty) జంటగా నటిస్తున్న చిత్రం ‘వారియర్‌’ (The Warrior). లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతమందించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం టీజర్‌, రెండు పాటలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రంలోని మూడో గీతం ‘విజిల్‌’ (Whistle)ను కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. ‘విజిలు.. విజిలు.. విజిలెయ్’ అంటూ సాగే ఈ పాటలోని రామ్‌, కృతిశెట్టి అభినయం, జానీ మాస్టర్‌ సమకూర్చిన నృత్యరీతులు ఆకట్టుకునేలా ఉన్నాయి. సాహితి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని ఆంథోనీ దాసన్‌, శిరీషా జయశీలన్‌ ఆలపించారు. ఈ చిత్రం జులై 14న ప్రేక్షకుల ముందుకురానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని