Kannappa: ‘కన్నప్ప’లో ఆ స్టార్‌ హీరో.. విష్ణు ఏమన్నారంటే..?

మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో నటించనున్న ‘కన్నప్ప’ (Kannappa) చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ అగ్ర కథానాయకుడు ఈ సినిమాలో భాగం కానున్నట్లు తెలుస్తోంది. 

Updated : 30 Sep 2023 16:16 IST

హైదరాబాద్‌: నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) కలల ప్రాజెక్ట్‌గా సిద్ధం కానున్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ‘మహాభారత’ సిరీస్‌ని రూపొందించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌  ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ (Prabhas) - నయనతార (Nayanthara) నటించనున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడీ సినిమాలో మరో అగ్ర కథానాయకుడు భాగం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఈ వార్తలపై విష్ణు ఏమన్నారంటే..?

మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని ‘కన్నప్ప’ చిత్రాన్ని రూపొందించనున్నారు. విష్ణు టైటిల్‌ రోల్‌ పోషిస్తుండగా.. శివ పార్వతులుగా ప్రభాస్‌, నయనతార నటించనున్నారంటూ  నటి మధుబాల తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో మలయాళీ అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్‌ భాగమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఆయన అతిథి పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై విష్ణు ఇప్పటికే ఆయన్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విష్ణు - మోహన్‌లాల్‌ కలిసి దిగిన ఓ ఫొటో శనివారం నెట్టింట వైరల్‌గా మారింది. ‘కన్నప్ప’లో మోహన్‌లాల్‌ నటించనున్నారంటూ నెట్టింట జరుగుతోన్న ప్రచారంపై విష్ణు స్పందించారు. ‘హర హర మహాదేవ’ అని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ పెట్టారు.

ఓటీటీలో మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

న్యూజిలాండ్‌ వేదికగా ‘కన్నప్ప’ షూటింగ్‌ జరగనుంది. ఒకే ఒక్క షెడ్యూల్‌లో దీన్ని పూర్తి చేయనున్నట్లు  విష్ణు ఇప్పటికే ప్రకటించారు. 800 మంది సిబ్బందితో 5నెలల పాటు ఆర్ట్‌ వర్క్‌ పూర్తి చేయించినట్లు ఇటీవల చెప్పారు. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా రానుంది. ప్రముఖ నటుడు మోహన్‌ బాబు (Mohan Babu) దీన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా మొదట నుపుర్‌ సనన్‌ను అనుకున్నారు. డేట్స్‌ సర్దుబాటు కాకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని