Miss Shetty Mr Polishetty ott: ఓటీటీలో మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Miss Shetty Mr Polishetty ott relase date: అనుష్క, నవీన్‌ జంటగా నటించిన తాజా చిత్రం ‘మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’ ఓటీటీ స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.

Published : 30 Sep 2023 14:51 IST

హైదరాబాద్‌: అనుష్క, నవీన్‌ పొలిశెట్టి కీలక పాత్రల్లో పి.మహేశ్‌బాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. ముఖ్యంగా అనుష్క నటన, నవీన్‌ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌ సినిమాను విజయపథంలో నడిపాయి. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అక్టోబరు 5వ తేదీ నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. (Miss Shetty Mr Polishetty ott relase date) ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్‌ పోస్టర్‌ను పంచుకుంది.

కథేంటంటే: అన్వి అలియాస్‌ అన్విత రవళి శెట్టి (అనుష్క) మాస్టర్‌ చెఫ్‌. లండన్‌లో ఓ పెద్ద స్టార్‌ హోటల్‌లో పని చేస్తుంటుంది. తనకు ప్రేమ, పెళ్లి, రిలేషన్‌ షిప్స్‌పై ఏమాత్రం నమ్మకం ఉండదు. దీనికి కారణం తన తల్లి (జయసుధ)ని ప్రేమించి.. పెళ్లి చేసుకున్న వాడు మోసం చేయడమే. అయితే, తన తల్లి అనారోగ్యంతో కన్నుమూశాక అన్వి ఒంటరవుతుంది. దాని నుంచి బయట పడటానికి తోడు వెతుక్కోవాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలోనే ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లి చేసుకోకుండానే ఐయూఐ విధానంలో ఓ బిడ్డకు జన్మనివ్వాలనుకుంటుంది. దీనికోసం వీర్య దాత కోసం వెతుకుతుండగా.. స్టాండప్‌ కమెడియన్‌ సిద్ధు పొలిశెట్టి (నవీన్‌ పొలిశెట్టి) పరిచయమవుతాడు.

2018 movie telugu review: రివ్యూ: మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి.. అనుష్క, నవీన్‌ల మూవీ అలరించిందా?

తన బిడ్డకు ఎలాంటి తండ్రి కావాలనుకుంటుందో అలాంటి లక్షణాలన్నీ సిద్ధులో కనిపించడంతో అతని సహాయం తీసుకోవాలని అనుకుంటుంది. అయితే అన్వి తనపై చూపిస్తున్న కేర్‌ను చూసి ఆమెతో ప్రేమలో పడిన సిద్ధు ఓరోజు తనకు ప్రపోజ్‌ చేస్తాడు. కానీ, ప్రేమ, పెళ్లిపై నమ్మకం లేని అన్వి తాను సిద్ధుకు దగ్గరవ్వడానికి వెనకున్న అసలు కారణాన్ని వివరిస్తుంది. తల్లి కావడానికి తనకు సహాయం చేయమని కోరుతుంది. అయితే ఆమె నిర్ణయం తెలిసి సిద్ధు ఒక్కసారిగా కంగు తింటాడు. పెళ్లి చేసుకోకుండా బిడ్డకు జన్మనివ్వాలనుకోవడం సమాజానికి విరుద్ధమని తన అభిప్రాయాన్ని వెల్లడిస్తాడు. పెళ్లి ప్రతిపాదన తీసుకొస్తాడు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. మరి అన్విత తాను అనుకున్నది సాధించిందా?(Miss Shetty Mr Polishetty Review In Telugu) ఆమె భారత్‌ నుంచి లండన్‌కు ఎందుకు తిరిగి వెళ్లిపోయింది? సిద్ధు తన ప్రేమను గెలుచుకోవడానికి ఏం చేశాడు? ప్రేమ, పెళ్లికి వ్యతిరేకంగా ఉన్న అన్వితను ఎలా మార్చాడు? చివరికి ఇద్దరూ కలిశారా? లేదా? అన్నది మిగతా కథ.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని