PUSHPA: ‘తగ్గేదే లే’.. అంతకంతకూ పెరుగుతోన్న ‘పుష్ప’ క్రేజ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(AlluArjun) నటించిన ‘పుష్ప’కు(Pushpa) క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా సిద్ధమైన ఈ చిత్రానికి ఇప్పటికే దేశవిదేశాల్లోని..
హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(AlluArjun) నటించిన ‘పుష్ప’(Pushpa) చిత్రానికి క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా సిద్ధమైన ఈ సినిమాకు ఇప్పటికే దేశవిదేశాల్లోని పలువురు ప్రముఖులు అభిమానులుగా మారగా.. తాజాగా ఓ రెజ్లర్ ఫిదా అయ్యారు. రెజ్లింగ్ రింగ్‌లోకి దిగి ‘తగ్గేదే లే’ అంటూ బన్నీ(Bunny) మేనరిజాన్ని చేసి చూపించారు. దీనికి సంబంధించిన వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ రెజ్లర్ ఎవరంటే..?
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ప్రముఖ రెజ్లర్ సౌరవ్ గుర్జార్ (Saurav Gurjar). గత కొంతకాలంగా ఆయన ‘డబ్ల్యూడబ్ల్యూఈ’(WWE)లో తలపడుతున్నారు. తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో ప్రత్యర్థితో పోటీపడుతూ ‘తగ్గేదే లే’ మేనరిజాన్ని ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ వీడియోని ఆయన ట్విటర్ వేదికగా షేర్ చేసి అల్లు అర్జున్‌ని ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ‘‘పుష్పరాజ్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందిగా’’ అని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ (Sukumar) ‘పుష్ప’ చిత్రాన్ని తెరకెక్కించారు. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ ఒదిగిపోయారు. కథానాయిక రష్మిక.. శ్రీవల్లిగా సందడి చేసింది. సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా గతేడాది డిసెంబరులో విడుదలై, రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్’లో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలోనే ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
మేకప్ రూమ్‌లో బంధించారు.. నిర్మాతపై నటి ఆరోపణలు
నిర్మాత వేధింపుల కారణంగా బాలీవుడ్ డ్రామా షో ‘శుభ్ షగున్’ నుంచి బయటకు వచ్చేసినట్లు నటి కృష్ణ ముఖర్జీ తెలిపారు. -
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
ప్రేమ స్వభావం ఎలా ఉన్నప్పటికీ దానిని వదులుకోవడం చాలా కష్టమన్నారు అగ్ర కథానాయకుడు కమల్ హాసన్. -
హాలీవుడ్‌కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
హాలీవుడ్‌కు వెళ్లిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తెలిపారు. -
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
బరువు పెరిగినప్పుడు బాధపడినట్లు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపారు. -
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది. -
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్‌లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
సల్మాన్‌ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్‌ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్