Yami Gautam: అవార్డులపై నమ్మకం లేదు: యామీగౌతమ్‌

బాలీవుడ్‌ నటి యామీగౌతమ్‌ ఆస్కార్‌ అవార్డులను ఉద్దేశిస్తూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.

Published : 12 Mar 2024 19:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి యామీగౌతమ్ (Yami Gautam) ‘ఆర్టికల్‌ 370’ (Article 370) చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కశ్మీర్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా దర్శకుడు ఆదిత్య సుహాస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో యామీగౌతమ్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెంట్‌గా నటించి అందరినీ ఆకట్టుకున్నారు. ఇటీవల ప్రకటించిన ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డు వేడుకల్లో సత్తా చాటిన ‘ఓపెన్‌ హైమర్‌’ నటుడు కిలియన్‌ మర్ఫీకు సోషల్‌మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు. ‘‘ కిలియన్‌ మర్ఫీ నిజాయతీ, ఓర్పు, సహనం ఉన్న అసాధారణ నటుడు. ఉత్తమ నటుడిగా అంతర్జాతీయ వేదికపై ఆయనను సత్కరించడం ఆనందంగా ఉంది. మీ ప్రతిభ అన్నింటికంటే ఉన్నతమైనది. మీకు నా అభినందనలు. నాకు ఈ ఫేక్‌ ఫిల్మ్‌ అవార్డులపై నమ్మకం లేదు. చాలా సంవత్సరాల నుంచి అవార్డు వేడులకు హాజరుకావడం లేదు’’ అని యామీ గౌతమ్‌ తన ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.

యామీగౌతమ్‌ ‘ఆర్టికల్‌ 370’ సక్సెస్‌ సందర్భంగా సోషల్‌మీడియాలో అభిమానులతో ముచ్చటించారు. ‘ఈ సినిమాలో మీ నటన అద్భుతంగా ఉంది. నేషనల్‌ అవార్డు కచ్చితంగా వస్తుంది’ అని ఓ అభిమాని ట్వీట్‌ చేశారు. దీనికి బదులుగా ‘‘ప్రతిరోజు ఇలాంటి కామెంట్స్‌ చదువుతున్నా. నాకు అవార్డు అందుకోవాలనే ఆశ లేదు. అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించినందుకు సంతోషంగా ఉంది. ఇంతకు మించి బహుమతి అంటూ ఏం లేదు. నిజ జీవితంలో నేను పోషిస్తున్న పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తూ.. మంచి కథను ఎంచుకుంటూ ప్రేక్షకులు మెచ్చేలా సినిమాలు చేయాలనే ఆలోచన మనసులో ఉంది’’ అని యామీ రిప్లై ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని