జమున నా అభిమాన నటి: పింగళి వెంకయ్య కుమార్తె!

అలనాటి సినీతార జమున వెండితెరపై కట్టు, బొట్టు ఎంత సంప్రదాయంగా ఉండేవో, అభినయం కూడా అంత అద్భుతంగా ఉంటుందని జాతీయ పతాక రూపకర్త

Published : 06 Sep 2021 20:31 IST

సింగపూర్‌: అలనాటి సినీతార జమున వెండితెరపై కట్టు, బొట్టుతో ఎంత సంప్రదాయంగా ఉంటారో, అభినయంతో కూడా అంత అద్భుతంగా ప్రేక్షకులను అలరించారని జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి అన్నారు. జమునా రమణారావు 85వ జన్మదినోత్సవం అంతర్జాలం వేదికగా ఘనంగా జరిగింది. వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా, తెలుగు కళా సమితి ఖతార్ కలిసి అత్యద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆన్‌లైన్‌లో సీతా మహాలక్ష్మి మాట్లాడుతూ.. అప్పట్లో జమున సినిమా వస్తే తప్పకుండా చూసేవాళ్లమని, ఇప్పుడు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం నిజంగా తన అదృష్టమని అన్నారు. ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్‌ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికీ తమ కళ్ల ముందు ఆమె పోషించిన సత్యభామ పాత్రలాగానే ఆమె కనిపిస్తారని అన్నారు. ఆమె ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సీతామహాలక్ష్మి, కె.విశ్వనాథ్‌లకు జమున ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో డాక్టర్ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి (USA) జమునకు స్వర్ణ కంకణ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించారు. వంశీ రామరాజు మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబరులో జమునకు కనకాభిషేకం చెయ్యబోతున్నట్టు ప్రకటించారు. ఈ వేడుక సందర్భంగా ప్రముఖ గాయని శారద ఆకునూరి మెగా సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాతాజీ ఉసిరికల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం దాదాపు 16 గంటల పాటు సాగింది. 30 దేశాల నుంచి 200 మందికి పైగా కవులు కళాకారులు పాల్గొని జమున నటించిన చిత్రాలలోని పాటలు ఎంచుకుని ఆట పాటలతో కార్యక్రమం ఆసాంతం రక్తి కట్టించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ కె.వి.రమణ, మురళీమోహన్ , మండలి బుద్ధప్రసాద్, కె.ఐ.వరప్రసాద్‌రెడ్డి, డాక్టర్ ఏవీ గురవా రెడ్డి, ఉపేంద్ర చివుకుల (అమెరికా), డాక్టర్ ఎంఎస్‌ రెడ్డి (అమెరికా), శారద ఆకునూరి (అమెరికా),డాక్టర్ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి (అమెరికా), తమ్మారెడ్డి భరద్వాజ, రేలంగి నరసింహారావు, డాక్టర్ సుద్దాల అశోక్ తేజ, మాధవపెద్ది సురేష్, భువనచంద్ర, డాక్టర్. కె.వి.కృష్ణ కుమారీ, దివ్యవాణి, తులసి,  రోజా రమణి, డాక్టర్ చిట్టెం రాజు వంగూరి, లక్ష్మీ రాయవరపు (కెనడా), గుణసుందరి కొమ్మారెడ్డి (అమెరికా), లలితారాం (అమెరికా), కల్యాణి కొండూరు (ఖతార్) శైలజ సుంకరపల్లి, డాక్టర్ తెన్నేటి సుధాదేవి, శ్రీదేవి జాగర్లమూడి ( అమెరికా), శారద కాశివజ్జల ( అమెరికా), లయన్ లక్ష్మీప్రసాద్ కపటపు, సుధీర్ కోట (అమెరికా), రాజేష్ ఎక్కలి (అమెరికా) కె.ఎస్‌. ప్రసాద్ (ఖతార్), తాతాజీ ఉసిరికల (ఖతార్) రత్నకుమార్ కవుటూరు (సింగపూర్), రాధిక మంగిపూడి ( సింగపూర్), సురేష్ కొండేటి, జయ పీసపాటి (హాంకాంగ్‌), బి. కృష్ణ కుమార్ (ఖతార్),  వి ఆర్ ఆర్ పద్మజ (ఖతార్), రాజేష్ తోలేటి (యూకే), జి వి ఎన్ నరసింహం , శ్రీలత మగతల (న్యూజిలాండ్), సారధి మోటమర్రి ( ఆస్ట్రేలియా), విజయ గొల్లపూడి ( ఆస్ట్రేలియా), డాక్టర్ వ్యాసకృష్ణ బూరుగుపల్లి (ఉగాండా), రాపోలు సీతారామరాజు ( సౌత్ ఆఫ్రికా), విక్రమ్ (సౌత్ ఆఫ్రికా), డాక్టర్ వెంకటపతి ( నార్వే), అనిల్ కుమార్ కడించెర్ల (ఒమాన్), హరి వేణుగోపాల్ (ఒమాన్), ఎం వి వి సత్యనారాయణ (ఖతార్),డి .సాయి సుబ్బారావు (కువైట్), వెంకటేశ్వరరావు (బోత్సువానా), సతీష్ (బోత్సువానా), పార్థసారథి (యుగాండా), సుందరగిరి శంకర గౌడ్ ( ఖతార్), రాధిక నోరి (అమెరికా), సత్యాదేవి మలుల్ల (మలేషియా), మరియు ఖతార్ తెలుగు కళాసమితి కార్యవర్గం పాల్గొన్నారు.  శారద ఆకునూరి,కల్యాణి కొండూరు, సుజిత సైని, దుర్గా భవాని,గౌరీదేవి బొమ్మన, మాధవి బైటారు, వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమాన్ని trinet లైవ్ టీవీ వారు ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని