గాన గంధర్వునికి ఆటా స్వరనీరాజనం

అమెరికా తెలుగు సంఘం (ఆటా) డల్లాస్, టెక్సాస్ కార్యవర్గ బృందం శనివారం (సెప్టెంబర్ 25, 2021) స్వర్గీయ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించింది.

Updated : 29 Sep 2021 21:17 IST

డల్లాస్‌: అమెరికా తెలుగు సంఘం (ఆటా) డల్లాస్, టెక్సాస్ కార్యవర్గ బృందం శనివారం (సెప్టెంబర్ 25, 2021) స్వర్గీయ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా గాన గంధర్వునికి స్వర కుసుమాలను నీరజనాలుగా అందిస్తూ ‘బాలు గాన సుధా స్మృతి’ పేరిట సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా తెలుగు చిత్రసీమ సంగీత దర్శకుల సారథ్యంలో బాలు ఆలపించిన మధురమైన పాటలను రాజశేఖర్ సూరిభొట్ల, సంతోష్ ఖమ్మామ్కర్, జానకి శంకర్, సాయి రాజేష్ మహాభాష్యం, సృజన ఆడూరి, ప్రభాకర్ కోట, చంద్రహాస్ మద్దుకూరి, శిరీష కోటంరాజు, నాగి వడ్లమన్నాటి, బాలాజి నరసింహన్, వీణ యలమంచలి, జ్యోతి సాదు, మల్లిక సూర్యదేవర, రోషిని బుద్ధ ఎంతో కమనీయంగా ఆలపించారు. ఈ కార్యక్రమానికి శారద సింగిరెడ్డి, రవి తూపురాణి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

ఆటా బోర్డు అఫ్ ట్రస్టీస్ అరవింద్ రెడ్డి, సతీష్ రెడ్డి, శారద సింగిరెడ్డి, రామ్ అన్నాడి, అడ్వయిజరి కమిటీ సంధ్య గవ్వ, పూర్వ కార్యదర్శి అనంత్ రెడ్డి పజ్జూర్, రీజినల్ కోఆర్డినేటర్స్ మహేష్ మానపురి, సుమన సారెడ్డి స్టాండింగ్ కమిటీస్ మంజు రెడ్డి ముప్పిడి, మహేందర్ గనపురం, దామోదర్ ఆకుల, మాధవి లోకిరెడ్డి సంయుక్తంగా ఆటా ఝుమ్మంది నాదం- 2021 పాటల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన శ్రీని ప్రభల, రాజశేఖర్ సూరిభొట్లతో పాటు ఆటాకు అందిస్తున్న సేవలకు గానూ రవి తూపురాణి, బాల గనపవరపును సన్మానించారు. ఆటా సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా బోర్డు అఫ్ ట్రస్టీ సతీష్ రెడ్డి  వివరించారు. ఆటా అధ్యక్షులు భువనేశ్ బుజాల, ఉత్తరాధ్యక్షులు మధు బొమ్మినేని ఆటా సంస్థతో ఎస్పీ బాలుకు ఉన్న అనుబంధాన్ని నెమరవేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని