యూఏఈలో వైభవంగా వైకుంఠనాథుడి కల్యాణోత్సవం

యూఏఈలోని అజ్మన్‌లో ప్రవాసాంధ్రులు వైకుంఠనాథుని కల్యాణోత్సవం వైభవంగా జరిపించారు. ఇండియన్ అసోసియేషన్ హాలులో.....

Published : 06 Apr 2022 16:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూఏఈలోని అజ్మన్‌లో ప్రవాసాంధ్రులు వైకుంఠనాథుని కల్యాణోత్సవం వైభవంగా జరిపించారు. ఇండియన్ అసోసియేషన్ హాలులో తిరుపతికి చెందిన ప్రవాసాంధ్రులు కటారు శ్రీలత, కటారు సుదర్శన్ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో తెలుగు రాష్ట్రాల భక్తులతోపాటు వివిధ రాష్ట్రాల, విదేశాల భక్తులు సైతం వైకుంఠవాసుని దర్శించుకున్నారు. ఉదయం సుప్రభాత సేవతో మొదలైన ఈ వేడుక.. పంచాంగ శ్రవణం, హోమం, చివరగా శ్రీనివాసుని సతీసమేత కల్యాణంతో ముగిసింది. ఈ కల్యాణోత్సవానికి నిర్వాహకుల విజ్ఞప్తి తితిదే నుంచి అధికారికంగా శ్రీనివాసాచార్యుల బృందం విచ్చేసి వేదమంత్రాల సాక్షిగా వైకుంఠ నాథుడి కల్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు.

ఈ వేడుకకు యూఏఈలోని శ్రీకృష్ణ మందిరం ఆలయ ధర్మకర్త వాసు షరాఫ్‌ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఏటా ఈ కల్యాణోత్సవానికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. కరోనా సమయంలోనూ అన్ని జాగ్రత్తలూ పాటించి కల్యాణం జరపడం అద్భుతంగా ఉందంటూ నిర్వాహకుల్ని ప్రశంసించారు. హైదరాబాద్‌ నుంచి విచ్చేసిన పంచాంగకర్త సూర్యనారాయణ పంచాంగ శ్రవణం చేశారు. కల్యాణం జరుగుతున్న వేళ భక్తులంతా వేంకటేశ్వర నామ కీర్తనలు ఆలపించారు. వైకుంఠవాసుని కల్యాణం అనంతరం భక్తులందరికీ తిరుపతి లడ్డూ ప్రసాదంతో పాటు అన్నప్రసాదాలు అందజేశారు. దాదాపు 15వేల మంది భక్తులు ఈ కల్యాణ వైభోగాన్ని తిలకించినట్టు అంచనా. నిర్వాహకుల ఏర్పాట్లను పలువురు ప్రశంసించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని