కాన్సాస్‌ నగర తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

కాన్సాస్ నగర తెలుగు సంఘం (TAGKC) ఆధ్వర్యంలో ఘనంగా శుభకృత నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక బ్లూ వ్యాలీ నార్త్‌ వెస్ట్‌ హైస్కూల్‌లో ఏప్రిల్ 9న ఈ కార్యక్రమం నిర్వహించారు.

Published : 14 Apr 2022 21:08 IST

కాన్సాస్‌ సిటీ (అమెరికా): కాన్సాస్ నగర తెలుగు సంఘం (TAGKC) ఆధ్వర్యంలో ఘనంగా శుభకృత్‌ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక బ్లూ వ్యాలీ నార్త్‌ వెస్ట్‌ హైస్కూల్‌లో ఏప్రిల్ 9న ఈ కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 600 మంది తెలుగువారు పాల్గొన్న ఈ కార్యక్రమం అందరినీ అలరించింది. సంఘం కార్యక్రమాల విభాగ నాయకుడు విశేష్ రేపల్లె స్వాగత ఉపన్యాసం చేశారు. అనంతరం స్థానిక దేవాలయ పూజారి శ్రీనివాసాచారి పంచాంగ శ్రవణం చేసి కొత్త సంవత్సరంలో రాశి ఫలాలు చదివి వినిపించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సంవత్సర అధ్యక్షుడు వంశీ సువ్వారి, ట్రస్ట్‌ బోర్డు ఛైర్మన్‌ దుర్గ తెల్ల కొత్త కార్యవర్గాన్ని అందరికీ పరిచయం చేశారు. కార్యక్రమానికి సహకరించిన కార్యకర్తలకు, కార్యవర్గ సభ్యులకు, దాతలకు, వచ్చిన ఆహూతులకు ధన్యవాదాలు తెలిపారు. మధ్య మధ్యలో రాఫెల్‌ టికెట్స్‌ తీసి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమం ఆద్యంతం వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన నేహా రెడ్డి, నిధి రావు తమదైన శైలిలో అందరినీ మెప్పించారు. ముఖ్యంగా నిధి పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. అలాగే, చిన్న పిల్లలు, పెద్దలు చేసిన నృత్యాలు, కూచిపూడి నృత్యం, వాయిద్యాలు లేకుండా నోటితో చేసిన సంగీత విభావరి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చివరగా ఉపాధ్యక్షుడు నరేంద్ర దుదెల వందన సమర్పణ, జనగణమనతో సాంస్కృతిక కార్యక్రమాలు ముగిశాయి. చక్కని భోజనం అనంతరం వేడుకలు ముగిశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు