ఘనంగా శివపదాల అంతర్జాతీయ పాటల పోటీ

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ రచించిన శివపదాల అంతర్జాతీయ పాటల పోటీ ఘనంగా జరిగింది.

Published : 17 May 2022 20:44 IST

సింగపూర్‌: బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ రచించిన శివపదాల అంతర్జాతీయ పాటల పోటీ ఘనంగా జరిగింది. రుషిపీఠం ఆధ్వర్యంలో మే 13, 14, 15న యూట్యూబ్ మాధ్యమంగా ఈ పోటీలను నిర్వహించారు. 14దేశాల నుంచి 300మందికి పైగా ఔత్సాహికులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. సంగీత గురువులు తులసీ విశ్వనాథ్(భారత్‌), పద్మ త్యాగరాజన్ (భారత్‌), శారదా సుబ్రమణియన్ (భారత్‌), కౌశిక్ కల్యాణ్ (భారత్‌), జీవీ ప్రభాకర్ (భారత్‌), ఎంవీ మెహన్ (భారత్‌), పెద్దాడ సూర్యకుమారి (భారత్‌), ఆర్వీ లక్ష్మిమూర్తి (భారత్‌), విష్ణుప్రియ భరధ్వాజ్ (భారత్‌), కాంత్ మల్లాజ్యోస్యుల (అమెరికా), లక్ష్మి కొలవెన్ను (అమెరికా), సుధా దూసి (అమెరికా), అనీల కుమార్ గరిమెళ్ళ (అమెరికా), లలిత రాంపల్లి (అమెరికా), శేషు కుమారి యడవల్లి (సింగపూర్), డా.పద్మా మల్లెల (ఆస్ట్రేలియా) న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. చిన్నారులు, పెద్దలు ఈ పాటల పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

పాటల పోటీ సందర్భంగా కంచి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతి పరిచయ వ్యాఖ్యలతో పాటు, తన ఆశీస్సులను అందించారు. అందరి పాటలు విన్న షణ్ముఖశర్మ, శివపదం తన కోసం, తన జీవితపరమావధిగా, సార్ధకతగా రాసుకున్న పాటలని అభివర్ణించారు. ఇంత మంది వాటిని చక్కగా పాడటం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. వాణీ, రవి గుండ్లాపల్లి, మేఘన, నాగ సంపత వారణాసి, హరి డొక్క, విజయ, శ్రీ కాంత్ వడ్లమాని బృందం ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో విశేష కృషి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని