నార్త్‌ కరోలినా, రాలీలో ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు

నార్త్‌ కరోలినా, రాలీ ప్రాంతాల్లో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు అంబరాన్ని తాకాయి. ఈ సందర్భంగా..

Published : 01 Jun 2022 00:25 IST

అమెరికా: అమెరికాలోని నార్త్‌ కరోలినా, రాలీ ప్రాంతాల్లో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు అంబరాన్ని అంటాయి. ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహానికి యూఎస్ఏలోని ప్రవాసాంధ్రులు, ఎన్టీఆర్‌ అభిమానులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిన తెలుగు తేజం ఎన్టీఆర్‌ అని కొనియాడారు. తెలుగు వాడి సత్తాను దేశానికి చాటి చెప్పారన్నారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా సగర్వంగా తలెత్తుకుని జీవించాలని ఎన్టీఆర్‌ అభిలషించారని పేర్కొన్నారు. 

ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలకు ఎన్‌ఆర్‌ఐ తెదేపా యూఎస్‌ఏ కన్వీనర్‌ జయరాం కోమటి, ఎమ్మెల్సీ మంతెన వెంకట సత్యనారాయణ రాజు, నటి ఎల్‌. విజయలక్ష్మి, డైరెక్టర్‌ వైవీఎస్‌ చౌదరి, నిరంజన్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. స్థానిక ఎన్టీఆర్‌ అభిమానులు వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఎన్టీఆర్‌ సినిమాల్లోని పాటలు, దుర్యోధనుడి పాత్రను పోషించి కనులవిందు చేశారు. అతిథుల కోసం 30 రకాలకుపైగా వంటలతో విందును ఏర్పాటు చేశారు. కార్యక్రమ నిర్వాహక కమిటీకి శ్రీనివాస్‌ ఆరెమండ నేతృత్వం వహించారు. సభ్యులు మాధవి మార్తాల, పూర్ణ కండ్రగుంట, మోహన్‌ కోడె, హరి నాదెండ్ల, కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌ అనంత, నాగరాజు, రవి కిశోర్‌, శిరీష్ గొట్టిముక్కల, శ్రీధర్ గొట్టిపాటి, శ్రీనివాస్‌ మార్తాల ముందుండి నడిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని