స్వరలయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు

స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ (Music academy) ఆధ్వర్యంలో త్యాగరాజస్వామివారి ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. రామకృష్ణా మిషన్ శారదాహాల్‌లో ఇందుకు వేదికైంది.

Published : 20 Mar 2023 19:31 IST

స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ (Music academy) ఆధ్వర్యంలో త్యాగరాజస్వామివారి ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. రామకృష్ణ మిషన్ శారదాహాల్‌ ఇందుకు వేదికైంది. అకాడమీ వ్యవస్థాపకురాలు యడవల్లి శేషుకుమారి గురువు గౌరీ గోకుల్,  రామకృష్ణ మిషన్ స్వామీజీ గౌరవ అతిథులుగా విచ్చేశారు. ‘TAS (మనం తెలుగు) అసోసియేషన్’, ‘శ్రీ సాంస్కృతిక కళా సారథి సింగపూర్’, STS ఎక్స్ ప్రెసిడెంట్  ప్రొఫెసర్  బీవీఆర్‌ చౌదరి ఇంకా పలువురు సింగపూర్ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వరలయ ఆర్ట్స్ సంస్థకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పత్రాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో యడవల్లి శేషు కుమారి, సౌభాగ్య లక్ష్మి తంగిరాల, షర్మిల చిత్రాడ, సౌమ్య ఆలూరు, కిరీటి దేశిరాజు,  యడవల్లి శ్రీ విద్య, యడవల్లి శ్రీరామచంద్రమూర్తి, శరజ అన్నదానం, రాధికా నడదూర్, రమ తదితరులు త్యాగరాజ పంచరత్న కీర్తనలను ఆలపించగా.. పలువురు చిన్నారులు, యడవల్లి శేషుకుమారి శిష్యులు త్యాగరాజ దివ్యనామ సంకీర్తనలను  ఆలపించారు. ఆదిత్య సత్యనారాయణ వయోలిన్‌పై, శివ కుమార్, కార్తీక్ మృదంగంపై వాయిద్య సహకారం అందించారు. ఇక ఈ కార్యక్రమానికి రోజా రమణి ఓరుగంటి, సౌజన్యలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని