కువైట్‌లో ఘనంగా తెదేపా ఆవిర్భావ వేడుకలు

తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ వేడుకలు కువైట్‌లో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.

Updated : 31 Mar 2023 06:11 IST

కువైట్‌: తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ వేడుకలు కువైట్‌లో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కువైట్‌లోని హవల్లి ప్రాంతంలోని ఎన్నారై తెదేపా కువైట్‌ కార్యవర్గం ఆధ్వర్యంలో బుధవారం ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సంబరాల్లో పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గల్ఫ్‌ ఎంపవర్‌మెంట్‌ కోఆర్డినేటర్‌ కుదరవల్లి సుధాకర్‌రావు మాట్లాడారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ సేవలందించారని గుర్తుచేశారు. తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు తన 14ఏళ్ల పాలనలో అటు ఉమ్మడి రాష్ట్రంలో, ఇటు నవ్యాంధ్రను అభివృద్ధి పథంలో తీసుకెళ్లారని అన్నారు. కార్యక్రమంలో ఎన్నారై తెదేపా కువైట్‌ కార్యవర్గం ప్రధాన కార్యదర్శి వేగి వెంకటేశ్‌నాయుడు, కోశాధికారి నరసింహనాయుడు, ఈడ్పుగంటి దుర్గాప్రసాద్‌, ప్రతినిధులు చాన్‌ బాషా, రమణయాదవ్‌, చుండు బాలరెడ్డయ్య, శంకర్‌, చిన్న రాజు, నరసింహులు, శివ మద్దిపట్ల, సురేష్‌, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు