లండన్‌లో శకపురుషునికి శతజయంతి నీరాజనం

లండన్‌లో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎన్నారై తెదేపా (యూకే టీమ్‌) ఆధ్వర్యంలో తెదేపా యూకే అధ్యక్షుడు వేణుమాధవ్‌ పోపూరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జీవిత విశేషాలతో వేడుకలు నిర్వహించారు.

Updated : 30 May 2023 06:14 IST

ఈనాడు, అమరావతి: లండన్‌లో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎన్నారై తెదేపా (యూకే టీమ్‌) ఆధ్వర్యంలో తెదేపా యూకే అధ్యక్షుడు వేణుమాధవ్‌ పోపూరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జీవిత విశేషాలతో వేడుకలు నిర్వహించారు. నందమూరి విగ్రహావిష్కరణతో పాటు 100 అడుగుల కేక్‌ కట్‌ చేశారు. పలువురు ప్రముఖులు పాల్గొని నందమూరి తారక రామారావుతో తమ అనుబంధాన్ని వివరించారు. ఈ కార్యక్రమానికి రత్నశ్రీ ఉప్పాల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అనంతరం తెలుగు రుచులతో భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పంజాబీ డోలే నృత్యాలు, 100 ఆకారంలో మానవహారం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని