గల్ఫ్‌ తెలుగు సంఘాల ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర్య వేడుకలు

గల్ఫ్‌లోని తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో భారత 75వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Updated : 17 Aug 2021 16:27 IST

కువైట్‌: గల్ఫ్‌లోని తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో భారత 75వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తెలుగు సంఘాల ఐక్యవేదిక-కువైట్‌ ఆధ్వర్యంలో గల్ఫ్‌దేశాల్లోని 8 సంఘాలు వర్చువల్‌గా వేడుకల్లో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కువైట్‌లో భారత రాయబారి సీబీ జార్జి, ప్రత్యేక అతిథిగా శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు,  గౌరవ అతిథిగా తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి హాజరై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా దేశభక్తి నేపథ్యంతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వ్యాఖ్యాత వెంకప్ప భాగవతులు కార్యక్రమాన్ని వినోదభరితంగా నడిపించారు. అనంతరం తెలుగు సంఘాల ఐక్య వేదిక-కువైట్‌ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకరరావు మాట్లాడుతూ గల్ఫ్‌ దేశాల్లోని తెలుగు సంఘాలు ఈ విధంగా స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు కళా సమితి- బహ్రెయిన్‌, తెలుగు కళా సమితి- ఒమన్‌, ఆంధ్ర కళా వేదిక- ఖతార్‌, సౌదీ తెలుగు అసోసియేషన్‌- సౌదీ అరేబియా, తెలుగు కళా స్రవంతి- అబుదాబి, తెలుగు తరంగిణి- రస్‌ అల్‌ ఖైమా, ఫుజైరా తెలుగు కుటుంబాలు- ఫుజైరా తదితర సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు