చికాగోలో ‘నాటా’ ఆత్మీయ సమావేశం

అమెరికాలోని చికాగోలో నాటా ఆత్మీయ సమావేశం ఉత్సాహంగా జరిగింది.

Published : 16 Apr 2023 22:14 IST

చికాగో: అమెరికాలోని చికాగోలో ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్‌ ఆత్మీయ సమావేశం ఉత్సాహంగా జరిగింది. జూన్‌ చివరి వారంలో డల్లాస్‌ నగరంలో జరగనున్న నాటా కన్వెన్షన్‌కు ఆహ్వానిస్తూ  ఆ సంఘం అధ్యక్షుడు కొర్సపాటి  శ్రీధర్‌రెడ్డి ఈ సమావేశాన్ని ప్రారంభించారు. నాటా బోర్డు సభ్యుడు లింగారెడ్డిగారి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హన్మంత్‌ రెడ్డి, మెట్టుపల్లె జయదేవరెడ్డి, కేకే రెడ్డి, హేమా కానూరి, రాంభూపాల్‌ రెడ్డి, శేషు రెడ్డి, కల్యాణ్‌ ఆనందుల, వెస్ట్మాంట్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ నేతలు సృజన్‌, శివ, వెంకట్‌, శివారెడ్డి, నరసింహరావు, ఆది, శేషు, శ్రీకాంత్‌ తదతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు రంగంలో విశిష్ఠ స్థానం సంపాదించుకున్నవారిని ఈ సభలకు ఆహ్వానించాలని, తెలుగు భాషా సంస్కృతికి పెద్ద పీట వేస్తున్న నాటా కార్యక్రమాలను జయప్రదం చేయాలని శ్రీధర్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆతిథ్యం ఇచ్చిన వెంకట్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని