కెంటకీలో ఉర్రూతలూగించిన సంగీత విభావరి

కెంటకీ రాష్టంలోని లుయివిల్‌ నగరంలో కెంటకీ తెలుగు సంఘం ఆధ్వర్యంలో సంగీత విభావరి కార్యక్రమం ఉత్సాహంగా......

Published : 02 May 2022 22:10 IST

అమెరికా‌: కెంటకీ రాష్టంలోని లుయివిల్‌ నగరంలో కెంటకీ తెలుగు సంఘం ఆధ్వర్యంలో సంగీత విభావరి కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి సారథ్యంలో ఆయన బృందం నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు భారీగా తరలివచ్చారు. కోటి స్వరపరచిన ఎన్నో హిట్ సినీ గీతాలను గాయనీగాయకులు ఆలపించారు. ప్రజాదరణ పొందిన ఈ పాటలకు ప్రేక్షకులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కెంటకీ తెలుగు సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ అడ్డాల మాట్లాడుతూ.. కరోనా నిబంధనల కారణంగా గత రెండేళ్లుగా ఎలాంటి కార్యక్రమాలూ నిర్వహించలేదని, కేసులు తగ్గుముఖం పట్టడం, కొవిడ్ నిబంధనలు సడలించడం వల్ల భారీగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బోర్డు, కార్యనిర్వాహక బృందాన్ని సభకు పరిచయం చేశారు. తందూరి ఫ్యూజన్ వారు ప్రేక్షకులకు విందు భోజనం అందించారు. ఉపాధ్యక్షుడు ప్రసాద్‌ నడింపల్లి వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని