తెదేపా ‘మహానాడు’పై బర్మింగ్‌హామ్‌లో ఎన్‌ఆర్‌ఐ నేతల భేటీ

తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని మే 28న ‘మహానాడు’ కార్యక్రమాన్ని యూరప్‌లోని వివిధ నగరాల్లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చేపట్టాల్సిన

Published : 25 Apr 2022 15:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని మే 28న ‘మహానాడు’ కార్యక్రమాన్ని యూరప్‌లోని వివిధ నగరాల్లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై యూకేలోని బర్మింగ్‌హామ్‌లో నేతలు సమావేశమై చర్చించారు. తెదేపా ఏపీ శాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమ, ఎన్‌ఆర్‌ఐ తెదేపా పొలిటికల్‌ సెల్‌ ఇన్‌ఛార్జ్‌ బుచ్చి రాంప్రసాద్‌, తెదేపా ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత తదితరులు జూమ్‌ ద్వారా ఈ సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేశారు. 

యూరప్‌లోని వివిధ దేశాల్లో ఉన్న తెదేపా అభిమానులు, కార్యకర్తలు, సానుభూతిపరులను వ్యక్తిగతంగా కలిసి మహానాడులో పాలుపంచుకొనేలా చేయాలని.. పార్టీ తరఫున అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. ఏపీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎవరిస్థాయిలో వారు తెదేపా మళ్లీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని కోరారు. అనంతరం నిర్వాహకులు అచ్చెన్నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో యూకే నుంచి జయకుమార్‌ గుంటుపల్లి, వేణుమాధవ్‌ పోపూరి, కిరణ్‌ పరుచూరి, నరేశ్‌ మల్లినేని, ప్రసన్న నాదెండ్ల, శ్రీనివాస్‌ పాలడుగు, చక్రి మువ్వ, సురేశ్‌ అట్లూరి, నారాయణరెడ్డి, శ్రీకాంత్‌ యర్రం, నాగరాజు బండ్ల, వీర పరిటాల, శ్రీధర్‌ నారా, కిరణ్‌ అరవపల్లి, యూకే విద్యార్థి విభాగం నేతలు భానూజీ కుక్కల, లింగా రవితేజ, హర్ష చప్పిడి, రవి నల్లమోతు.. ఐర్లాండ్‌ నుంచి మురళీ రాపర్ల, జర్మనీ నుంచి టిట్టు, శివ, పోలండ్‌ నుంచి చందు, బెల్జియం నుంచి దినేష్‌, ఫ్రాన్స్‌ నుంచి మహేశ్‌ తదితరులు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని