America: అమెరికా స్కూల్‌లో ‘జనగణమన’.. వీడియో వైరల్‌

అమెరికాలోని ఓ పాఠశాలలో ‘జనగణమన’ గీతాలాపన అందరినీ ఆకట్టుకుంది. వాయిద్యాలతో భారత జాతీయ గీతాన్ని ఎంతో మధురంగా ఆలపించారు.

Published : 22 Dec 2022 13:09 IST

వాషింగ్టన్‌: భారత జాతీయ గీతం ‘జనగణమన’ వింటే భారతీయులదే కాదు.. ప్రతి ఒక్కరి గుండె పులకించిపోతుంది. అగ్రరాజ్యం అమెరికాలోని ఓ పాఠశాలలో ‘జనగణమన’ గీతాలాపన అందరినీ ఆకట్టుకుంది. వాయిద్యాలతో భారత జాతీయ గీతాన్ని ఎంతో మధురంగా ఆలపించారు. అమెరికాలోని ఎడిసన్‌ టౌన్‌షిప్‌లో ఉన్న జాన్‌ మార్షల్‌ ఎలిమెంటరీ స్కూల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. వాయిద్యాలు వాయిస్తూ పాఠశాల విద్యార్థులు, సిబ్బంది కలిసి జాతీయ గీతాన్ని వినసొంపుగా ఆలపించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్‌గా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని