తానా ఆధ్వర్యంలో పెద అవుటుపల్లిలో సేవా కార్యక్రమాలు

తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి స్వగ్రామం పెద అవుటుపల్లిలో తానా చైతన్య స్రవంతి సందర్భంగా నిర్వహించిన సేవా కార్యక్రమాలకు మంచి ఆదరణ లభించింది.

Updated : 27 Dec 2022 07:43 IST

ఏలూరు: తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి స్వగ్రామం పెద అవుటుపల్లిలో తానా చైతన్య స్రవంతి సందర్భంగా నిర్వహించిన సేవా కార్యక్రమాలకు మంచి ఆదరణ లభించింది.లావు అంజయ్య చౌదరి ఆధ్వర్యంలో తానా ర్వీసెస్ డే సందర్భంగా ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం పెద అవుటుపల్లి గ్రామంలో ఆర్సీఎం స్కూల్‌లో ఉచిత క్యాన్సర్, కంటి పరీక్షలు, ఆర్థోపెడిక్‌, ముక్కు,చెవి, గొంతు పరీక్షలు నిర్వహించారు.

ఉంగుంటూరు మండలంలోని 27 గ్రామాల ప్రజలతోపాటు గన్నవరం, దావాజి గూడెం, అల్లపురం, మర్లపాలెం తదితర గ్రామాల నుంచి వచ్చినలకు కూడా పరీక్షలు నిర్వహించారు. తానా ఫౌండేషన్ మరియు గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాన్సర్ క్యాంపు, టాప్ స్టార్ హాస్పిటల్స్-విజయవాడ సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. తానా క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంలో భాగంగా మొక్కలు నాటారు. ‘తానా రైతు కోసం’ కార్యక్రమంలో భాగంగా రైతులకు రక్షణకిట్లు పంపిణీ చేశారు. ‘తానా చేయూత’ ద్వారా 20 మంది అనాథ పిల్లలకు స్కాలర్‌షిప్‌లను అందించారు. జిల్లా పరిషత్ హైస్కూల్ అభివృద్ధి కోసం రూ.లక్ష విరాళం అందించారు. ఈ కార్యక్రమానికి తానా ప్రతి నిధులు, రాజకీయ ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని కిరణ్ సమన్వయం చేశారు.

ఈ కార్యక్రమంలో వెంకటరమణ యార్లగడ్డ (తానా ఫౌండేషన్ చైర్మన్), సతీష్ వేమూరి (తానా సెక్రటరీ), సతీష్ వేమన (మాజీ తానా అధ్యక్షులు) రవి పోట్లురి (2023 తానా కన్వెన్షన్‌ కన్వీనర్‌), సునీల్ పాత్ర (తానా చైతన్య స్రవంతి కో ఆర్డినేటర్), రాజా కసుకుర్థి, తానా కమ్యూనిటి సర్వీసెస్,  సురేష్ పుట్టగుంట, ఫౌండేషన్ ట్రస్టీ, శ్రీనివాస్  ఒరుగంటి, ఫౌండేషన్ ట్రస్టీ,  శశాంక్ యార్లగడ్డ, స్పోర్ట్స్ కో ఆర్డినేటర్, ఠాగోర్ మలినేని, మీడియా కో ఆర్డినేటర్, శ్రీనివాస్ కోకట్ల, ఈవెంట్స్  కో ఆర్డినేటర్, జోగేశ్వరరావు పెద్దిబోయిన, లక్ష్మీనారాయణ సూరపనేని, అనిల్ లింగమనేని, గన్నే రమణ, వంశీ కోట, రమేష్ యలమంచిలి, శ్రీనివాస్ నాదెండ్ల, అనిల్ యలమంచిలి, శ్రీనివాస్ తాతినేని, సుమంత్ పూసులురుతోపాటు ప్రజాప్రతినిధులు లావు రత్తయ్య (విజ్ఞాన సంస్థల అధినేత) శ్రీ కృష్ణ దేవరాయులు(నరసరావుపేట ఎంపీ),కంభంపాటి  రామ మోహనరావు (మాజీ రాజ్య సభ సభ్యులు) మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, శాసనసభసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి  ప్రత్తిపాటి పుల్లరావు, మాజీ విప్‌ కూన రవికుమార్, మాజీ ఎమ్మెల్యే ఆరుమళ్లీ రాధాకృష్ణ, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్, మాజీ గూడా ఛైర్మన్‌ గన్ని కృష్ణ,  కొమ్మరెడ్డి పట్టాభి, కేసీనేని చిన్ని, రాము వెనిగళ్ల, కొనగల్ల బుల్లయ్య,  ఆళ్ల వెంకట గోపాలకృష్ణ రావు, మూల్పూరి సాయి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు