బర్మింగ్‌హామ్‌లో భద్రాచలం.. ఘనంగా శ్రీసీతారాముల కల్యాణోత్సవం

యూకేలోని బర్మింగ్‌హామ్‌లో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని

Updated : 22 Apr 2022 10:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యూకేలోని బర్మింగ్‌హామ్‌లో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఏప్రిల్‌ 10న నిర్వహించిన ఈ కార్యక్రమానికి 3వేలకు పైగా భక్తులు హాజరయ్యారు. వేదపండితులు వేలమూరి వెంకటరమణ, ముకురాల సిద్ధార్థశర్మ వేదోక్తపూర్వకంగా కల్యాణోత్సవం జరిపారు. కార్యక్రమంలో భాగంగా బాచంపల్లి సంతోష్‌కుమార్‌ శాస్త్రి వ్యాఖ్యానం అందించారు. కల్యాణోత్సవం అనంతరం భక్తులకు ప్రసాదంతో పాటు ప్రతి కుటుంబానికి తిరుమల శ్రీవారి లడ్డూ, రామపరివార్‌ కాయిన్‌, రామకోటి పుస్తకాలను నిర్వాహకులు అందజేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని