TANA: నారిస్‌టౌన్‌లో ‘తానా’ మహాసభల సమన్వయ కమిటీ సమావేశం

అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం నారిస్‌టౌన్‌లోప్రతిష్ఠాత్మక ‘తానా’ 23వ మహాసభల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.

Updated : 20 Apr 2023 11:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం నారిస్‌టౌన్‌లోప్రతిష్ఠాత్మక ‘తానా’ 23వ మహాసభల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది జులై 7, 8, 9 తేదీల్లో పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్న మహాసభలను జయప్రదం చేసేందుకు ప్రస్తుత  కార్యాచరణ, అతిథుల ఏర్పాట్లు, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

డెలావేర్‌, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా రాష్ట్రాల నుంచి మహాసభల కమిటీ సభ్యులు హాజరై తమ కమిటీల కార్యాచరణ, పురోగతి, నిర్వహణ ప్రణాళిక తదితర విషయాలను వివరించారు. ఈ సందర్భంగా తానా వ్యవస్థాపకులు, తొలి అధ్యక్షులు దివంగత కాకర్ల సుబ్బారావు ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకుని కమిటీ సభ్యులు పుష్పగుచ్ఛాలతో ఘనంగా నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని