తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు

తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి.

Published : 18 Jan 2024 22:34 IST

టొరంటో: తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. కెనడా రాజధాని టోరొంటోలోని బ్రాంటెన్‌లో ఉన్న చింగ్కూజీ సెకండరీ స్కూల్‌లో జరిగిన ఈ వేడుకల్లో 800 మందికి పైగా తెలంగాణ వాసులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ వేడుకలను టీసీఏ కార్యదర్శి శంతన్ నేరళ్లపల్లి ప్రారంభించారు. మేఘన గుర్రాల, శైలజ ఎర్ర, స్ఫూర్తి కొప్పు, ప్రహళిక మ్యాకల, శ్రీరంజని కందూరిలు జ్యోతి ప్రజ్వలన చేశారు. శ్రీరామదాసు అర్గుల గణేష వందనంతో సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు.

టీసీఏ అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాల ద్వారా తెలంగాణ పండగ, సంప్రదాయాలను భావితరాలకు తెలియజేసేందుకు దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో రాహుల్ బలనేని, జ్యోతి రాచ సారథ్యంలో 15 సంవత్సరాలలోపు పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్, షో అండ్ టెల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణీతలుగా ప్రవీణ్ నీల, ఝాన్సీలక్ష్మి గరిమెళ్ల, గుప్తేశ్వరి వాసుపిల్లి, మనస్విని వెలపాటి వ్యవహరించారు. అనంతరం వందమందికి పైగా చిన్నారులకు భోగి పండ్లు పోసి ఆశీర్వచనాలను అందించారు. 2024 టోరెంటో తెలుగు క్యాలెండర్‌ను డాక్టర్ సౌజన్య కాసుల, యేసు బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ ఉత్సవాలను సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు, శ్రీరంజని కందూరి, ప్రహళిక మ్యాకల వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. 

ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మన్నెం, కార్యదర్శి శంతన్ నారెళ్ళపల్లి, సంయుక్త కార్యదర్శి రాజేష్ అర్ర, సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు, సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి ప్రహళిక మ్యాకల, సంయుక్త కోశాధికారి రాహుల్ బాలనేని, డైరెక్టర్లు నాగేశ్వరరావు దలువాయి, ప్రణీత్ పాలడుగు, భగీరథ దాస్ అర్గుల, ప్రవీణ్ కుమార్ సామల, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ చైర్మన్ నవీన్ ఆకుల, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ అతిక్ పాషా, వ్యవస్థాపక సభ్యులు దేవేందర్ రెడ్డి గుజ్జుల, కోటేశ్వర రావు చిత్తలూరి, కలీముద్దీన్ మొహమ్మద్, ప్రకాష్ చిట్యాల, అఖిలేష్ బెజ్జంకి, హరి రావుల్, సంతోష్ గజవాడ, వేణుగోపాల్ రోకండ్ల, ప్రభాకర్ కంబాలపల్లి, విజయ్ కుమార్ తిరుమలపురం పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు