పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు విశేషకృషి చేస్తాం: యూరప్‌ తెదేపా

తెదేపా అధినేత చంద్రబాబు స్ఫూర్తితో, నారా లోకేశ్‌ నాయకత్వంలో జన్మభూమి కోసం పాటుపడతామని డాక్టర్‌ కిశోర్‌ బాబు చలసాని తెలిపారు.

Updated : 21 Jan 2024 14:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెదేపా అధినేత చంద్రబాబు స్ఫూర్తితో, నారా లోకేశ్‌ నాయకత్వంలో జన్మభూమి కోసం పాటు పడతామని డాక్టర్‌ కిశోర్‌ బాబు చలసాని తెలిపారు. దీని కోసం ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌, యూకే, స్విట్జర్లాండ్, బెల్జియం, మాల్టా, ఇటలీ, డెన్మార్క్‌, నార్వే, స్వీడన్‌, ఫిన్లాండ్‌, పోలండ్‌, హంగేరి, సైప్రస్‌ తదితర యూరప్‌ దేశాలకు చెందిన ప్రవాసాంధ్రులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామన్నారు. ఎన్‌ఆర్‌ఐ తెదేపా యూరప్‌ నేతలు పార్టీలకు అతీతంగా సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. పార్టీ ఆదేశాల మేరకు ఉక్రెయిన్‌లో బాధితులకు సహాయం చేయడంలో ముందు వరుసలో నిలిచారు. విదేశాలకు వచ్చిన విద్యార్థులకు తమ శక్తి మేరకు సాయం చేస్తున్నారు. సోషల్‌ మీడియా, ఇతర విభాగాల్లో కార్యకర్తలకు శిక్షణ ఇస్తూ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్నీ ఇక్కడ చేస్తున్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో క్రికెట్‌ లీగ్‌, గుంటూరు జిల్లా అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థికసాయం, నారా లోకేశ్‌ చేపట్టిన యువగళంలో భాగస్వాములు కావడం తదితర కార్యక్రమాలు ఇందుకు నిదర్శనం. తెదేపా వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్‌ వర్ధంతిని పురస్కరించుకొని యూరప్‌ తెదేపా తరఫున ఊట్ల శ్యామ్‌ సుందర్‌రావు (లండన్‌) తన వంతుగా పూతలపట్టు నియోజకవర్గంలో అన్న క్యాంటీన్‌ ఏర్పాటుకు కృషి చేశారు. భవిష్యత్‌లోనూ ఇలాంటి సేవాకార్యక్రమాలు కొనసాగిస్తూ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని కిశోర్‌ బాబు, అమర్నాథ్ పొట్లూరి, వివేక్ కరియవుల, కృష్ణ ప్రసాద్ కాట్రగడ్డ, ప్రముఖ్ గోగినేని, చందు కాట్రగడ్డ ,విజయ్ అడుసుమల్లి, వూట్లా శ్యామ్ సుందర్ రావు, వెంకటపతి తరిగొప్పుల, శివబాబు వేములపల్లి, డా.హరిప్రసాద్ కుత్తంబాకం, స్వాతీరెడ్డి, శ్రీనివాస్ గోగినేని, విజయ్ కృష్ణ చందోలు, జితేశ్ గోడి, కృష్ణ వల్లూరి, ప్రవీణ్ ఉన్నం, ప్రవీణ్ వెలువోలు, కొండయ్య కావూరి, శివ కృష్ణ, సుమంత్ పదాల, రామకృష్ణ, సతీష్ ముళ్ళపూడి, సాయి వెంకట్ మౌర్య, ఇతర యూరప్‌ తెదేపా అనుబంధ సభ్యులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని