AP High Court: మంత్రి అంబటి, మోహిత్‌రెడ్డి పిటిషన్లను డిస్మిస్‌ చేసిన హైకోర్టు

మంత్రి అంబటి రాంబాబు, చంద్రగిరి వైకాపా అభ్యర్థి మోహిత్‌రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన రెండు పిటిషన్లను ఏపీ హైకోర్టు డిస్మిస్‌ చేసింది.

Published : 23 May 2024 19:21 IST

అమరావతి: రీపోలింగ్‌ జరపాలని కోరుతూ మంత్రి అంబటి రాంబాబు, చంద్రగిరి వైకాపా అభ్యర్థి మోహిత్‌రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన రెండు పిటిషన్లను ఏపీ హైకోర్టు డిస్మిస్‌ చేసింది. పోలింగ్‌ రోజు హింసాత్మక ఘటనల నేపథ్యంలో సత్తెనపల్లిలోని నాలుగు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ జరపాలని మంత్రి అంబటి ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. మరో వైపు తిరుపతి జిల్లా చంద్రగిరిలో రీపోలింగ్‌ నిర్వహించాలని మోహిత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని