Rohit Sharma: కెప్టెన్సీ మార్పు.. విరాట్‌ కోహ్లీపై రోహిత్‌ శర్మ ప్రశంసలు

విరాట్ కోహ్లీపై టీమ్‌ఇండియా కొత్త సారథి రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ వంటి నాణ్యమైన బ్యాటర్ జట్టులో ఉండటం ఎంతో ముఖ్యమని పేర్కొన్నాడు.  అతని అనుభవం జట్టుకి చాలా అవసరమని,  కష్ట సమయాల్లో తన అద్భుత

Published : 09 Dec 2021 17:17 IST

ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీపై టీమ్‌ఇండియా కొత్త సారథి రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ వంటి నాణ్యమైన బ్యాటర్ జట్టులో ఉండటం ఎంతో ముఖ్యమని పేర్కొన్నాడు.  అతని అనుభవం జట్టుకి చాలా అవసరమని,  కష్ట సమయాల్లో తన అద్భుత ఆటతీరుతో  జట్టుని ఆదుకున్నాడని వివరించాడు. టీ20ల్లో 50కి పైగా సగటు ఉండటం అత్యంత అరుదని హిట్‌మ్యాన్ వెల్లడించాడు.

'విరాట్‌ కోహ్లీ వంటి నాణ్యమైన బ్యాటర్‌ జట్టుకెప్పటికీ అవసరం. టీ20 ఫార్మాట్‌లో 50 పరుగుల కంటే ఎక్కువ సగటు ఉండటం అంత సులభం కాదు. నిజంగా ఇది క్రేజీ! తన అనుభవంతో జట్టును ఎన్నోసార్లు కష్టాల్లో గట్టెక్కించాడు. అతడిలోని నాణ్యత, బ్యాట్స్‌మన్‌షిప్‌ చాలా అవసరం. అతనిప్పటికీ నాయకుడే.  వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని అతడు దూరం కావాలని ఎవరూ కోరుకోరు. అతడిని ఎవరూ విస్మరించరు. అతడి ఉనికి జట్టుకెంతో అవసరం' అని రోహిత్‌ అన్నాడు.

పని ఒత్తిడి కారణంగా టీ20ల్లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొంటానని ఇటీవల ముగిసిన పొట్టి ప్రపంచకప్‌కి ముందు విరాట్ కోహ్లీ ప్రకటించాడు. దీంతో ఆ బాధ్యతలను ఓపెనర్‌ రోహిత్ శర్మకు అప్పగించింది బీసీసీఐ. తాజాగా వన్డే కెప్టెన్సీ పగ్గాలను సైతం హిట్‌మ్యాన్‌కే అప్పగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లిని వన్డే సారథిగానూ తప్పుకోవాలని సెలక్టర్లు సూచిస్తూ రెండు రోజులు గడువు ఇవ్వగా.. అతడి నుంచి స్పందన లేకపోవడంతో నిర్మొహమాటంగా వేటు వేసినట్లు తెలుస్తోంది. 

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని