IN PICS: మహీ అంటే అంతేగా మరి!
అంతర్జాతీయ క్రికెట్‌కు మహేంద్రసింగ్ ధోనీ వీడ్కోలు పలికి అప్పుడే మూడు రోజులు అవుతోంది. తనకు అలవాటైన శైలిలో కూల్‌గా రిటైర్మెంట్ ప్రకటించడంతో అందరూ షాకయ్యారు. మరో ఏడాదైనా ఆడితే బాగుండేదని అనుకుంటున్నారు! బ్యాటింగ్, కీపింగ్, కెప్టెన్సీలో అతడు సాధించిన ఘనతలను....
జై జవాన్ జై కిసాన్ నినాదమే అతడి గుండె సవ్వడి
ఆస్తిపాస్తులు ఎన్నివున్నా చిన్ననాటి మిత్రులతో షికారే ఇష్టం
అంతర్జాతీయ క్రికెట్‌కు మహేంద్రసింగ్ ధోనీ వీడ్కోలు పలికి అప్పుడే మూడు రోజులు అవుతోంది. తనకు అలవాటైన శైలిలో కూల్‌గా రిటైర్మెంట్ ప్రకటించడంతో అందరూ షాకయ్యారు. మరో ఏడాదైనా ఆడితే బాగుండేదని అనుకుంటున్నారు! బ్యాటింగ్, కీపింగ్, కెప్టెన్సీలో అతడు సాధించిన ఘనతలను పదేపదే గుర్తు చేసుకుంటున్నారు. క్రికెటర్లతో వీడియో గేములు ఆడటం, కుమార్తె జీవాతో కలిసి సందడి చేయడం, సతీమణి సాక్షితో ప్రేమాయణం, చెపాక్‌లో బాదిన సిక్సర్లను నెమరు వేసుకుంటున్నారు.
మీకో విషయం తెలుసా? మహీ పూర్తిపేరు ‘మహేంద్రసింగ్ పాన్‌సింగ్ ధోనీ’. అభిమానులు మహీ, కెప్టెన్ కూల్, ఎంఎస్డీ, తలా అని ఇష్టంగా పిలుస్తారు. ధోనీ సోదరి పేరు జయంతి గుప్తా, సోదరుడు నరేంద్ర సింగ్ ధోనీ. ఇక సతీమణి సాక్షి, కుమార్తె జీవా గురించి అందరికీ తెలిసిందే.
మహీ ఆదర్శ క్రికెటర్లు ఆడమ్ గిల్‌క్రిస్ట్, సచిన్ తెందూల్కర్. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, గాయని లతా మంగేష్కర్ అంటే ఇష్టం. నిజానికి అతడు ఫుట్‌బాల్‌లో గోల్‌కీపర్ అవ్వాల్సింది. పాఠశాల క్రికెట్ జట్టుకు ఓసారి కీపర్ దొరక్కపోతే ఫుట్‌బాల్ ఆడుతున్న ధోనీని కోచ్ చూశాడు. మ్యాచ్ ఆడించాడు. దాంతో అతడి జీవితంలో క్రికెట్ భాగంగా మారిపోయింది. మొదట్లో స్థానిక క్లబ్బులు, 2001-2003 మధ్య రైల్వేకు ఆడాడు. కొన్నాళ్లు టీటీఈగా పనిచేస్తూ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.
1999-2000 సీజన్లో బిహార్ తరఫున ధోనీ రంజీల్లో అరంగేట్రం చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 68* పరుగులు చేశాడు. 2004, డిసెంబర్ 23న బంగ్లాదేశ్‌పై వన్డేల్లో, 2005, డిసెంబర్ 2న శ్రీలంకపై టెస్టుల్లో అంతర్జాతీయ కెరీర్ ఆరంభించాడు. 2006లో దక్షిణాఫ్రికాపై టీ20ల్లో అరంగేట్రం చేశాడు. టెస్టు కెరీర్ 2014, డిసెంబర్ 30న, వన్డే కెరీర్ 2019, జులై 10న, టీ20 కెరీర్ 2019, ఫిబ్రవరి 27న ముగిశాయి.
టీమ్ఇండియాకు చేసిన సేవలకు ప్రభుత్వం ధోనీని అత్యున్నత పౌర పురస్కారాలతో సత్కరించింది. మొదట పద్మశ్రీ, తర్వాత పద్మ భూషణ్‌తో గౌరవించింది. సైనిక దుస్తుల్లో అతడు పద్మభూషణ్‌ను అందుకోవడం గమనార్హం. ఎందుకంటే సైన్యంలో మహీ లెఫ్ట్‌నెంట్ కర్నల్. భారత క్రికెటర్లలో కపిల్ దేవ్ తర్వాత ఈ ర్యాంకు పొందింది అతడే కావడం గమనార్హం.
మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక సారథి మహీ మాత్రమే. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు. అతడి ఖాతాలో రెండు ఆసియా కప్పులూ ఉన్నాయి. ఈ ఘనత ఎప్పటికీ అతడి పేరుతోనే ఉంటుందని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నారు. దీనిని తిరిగరాయడం సులువుకాదని పేర్కొన్నారు.
భారత సైన్యంలో ధోనీ పారాచూట్ విభాగంలో పనిచేశాడు. విధుల్లో భాగంగా పారాచూట్‌తో విమానం నుంచి కిందకు దూకాడు. ‘గతేడాది ఇదే సమయంలో మా బృందం నాలుగు పగళ్లు, ఒక రాత్రి జంప్ చేశాం. 22 రోజుల శిక్షణ అద్భుతంగా సాగింది’ అని గతంలో సోషల్ మీడియాలో పెట్టాడు. సరిహద్దుల్లోనూ అతడు విధులు నిర్వర్తించాడు. 2019 ప్రపంచకప్ ముగిశాక అతడు రెండు నెలలు సైన్యంలో పనిచేసి వచ్చాడు.
మహీ నాయకత్వం వహిస్తున్న చెన్నై సూపర్‌కింగ్స్ ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన రెండో జట్టు. ఇప్పటి వరకు మూడుసార్లు ట్రోఫీ అందుకుంది. 2016లో ఆ జట్టుపై నిషేధం విధించడంతో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌కు ధోనీ ఆడాడు. మళ్లీ 2018లో చెన్నై తరఫున రీఎంట్రీ ఇచ్చి టైటిల్ గెలిచాడు. డాడీస్ ఆర్మీ అని అందరూ ఎగతాళి చేసినా కసితో విజయం సాధించామని ఓ సందర్భంలో ధోనీ చెప్పొకొచ్చాడు.
సతీమణి సాక్షి, కుమార్తె జీవా అంటే మహీకి పంచప్రాణాలు! మ్యాచుల్లేనప్పుడు వారితోనే సమయం గడుపుతాడు. సాక్షికి ఒకసారి పాదరక్షలు కొనిచ్చి స్వయంగా అతడే తొడిగాడు. మరోసారి బ్రేస్లెట్ ఇచ్చాడు. ఇక కుమార్తెతో ఎప్పుడూ ఆడుతూనే ఉంటాడు. తాజ్ హోటల్లో పనిచేస్తున్న సాక్షిని ధోనీ ప్రేమించి పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె మహీ చదివిన పాఠశాలలోనే చదుకోవడం గమనార్హం.
ధోనీకి క్రికెట్‌తోనే కాకుండా ఇతర క్రీడలతోనూ సంబంధాలు ఉన్నాయి. హాకీ ఇండియా లీగ్‌లో ‘రాంచీ రేస్’కు అతడే యజమాని. ఇండియన్ సూపర్ లీగ్‌లో ‘చెన్నైయిన్ ఎఫ్‌సీ’కి సహ యజమాని. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్, విటా దాని భాగస్వాములు. రితీ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అనే వ్యాపార సంస్థా అతడికి ఉంది.
రొటీన్‌కు భిన్నంగా ఉండటం ధోనీకి ఇష్టం. ఒకవైపు ఖరీదైన బైకులు, వాహనాలంటే ఇష్టం. హెల్మెట్ పెట్టుకొని గుట్టుచప్పుడు కాకుండా తిరిగొస్తాడు. మరోవైపు రైతుగా ఉంటాడు. రాంచీలోని తన వ్యవసాయ క్షేత్రంలో అతడు సేంద్రియ వ్యవసాయం చేయిస్తున్న సంగతి తెలిసింది. ఎండకాలంలో పుచ్చకాయలు పండించాడు. కొన్నాళ్ల తర్వాత బొప్పాయి సాగు మొదలుపెట్టాడు.
మహీకి షూటింగ్ అంటే పిచ్చి. అందుకే తుపాకీలుండే వీడియోగేమ్‌లు ఎక్కువగా ఆడతాడు. తన ఇంటి ఆవరణలో షూటింగ్ యార్డ్ కూడా ఉంది. ‘యాడ్ షూటింగ్ కన్నా తుపాకీ షూటింగ్ చాలా సరదాగా ఉంటుంది’ అని ఓసారి అన్నాడు. అంతేకాదు టీమ్ఇండియా, సీఎస్కే సభ్యులతో కలిసి వీడియో గేమ్‌లు బాగా ఆడతాడు. సుశాంత్‌సింగ్ రాజ్‌పూత్ నటించిన ‘ఎంఎస్ ధోనీ అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమా మహీ గురించి తెలియని విశేషాలను చూపించింది.
2008, 2009లో ధోనీ ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు గెలిచాడు. 2008లో రాజీవ్ ఖేల్‌రత్న అందుకున్నాడు. క్రికెట్లో ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ఎందరో కొత్త స్నేహితులు లభించారు. అయినప్పటికీ తన చిన్ననాటి మిత్రులను కలిసేందుకు, వారితో గడిపేందుకు మహీ విలువిస్తాడు. వారితో కలిసి ప్రయాణాలు చేస్తుంటాడు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్‌కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
హైదరాబాద్‌కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
చెపాక్‌లో చూసుకుందాం.. లఖ్‌నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్‌కు వచ్చేసింది. లఖ్‌నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్‌నవూ విజయం సాధించింది. -
వరుస ఓటములతో డీలా.. బెంగళూరుకు ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా..?
ఈ సీజన్లో బెంగళూరు పేలవమైన ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఆడిన ఎనిమిదింట్లో ఏడు ఓడి.. ప్లేఆఫ్స్ అవకాశాలకు దాదాపు దూరమైంది . -
200+ స్కోరు... చాలడం లేదు బాసూ!
ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచ్‌లు చివరి బంతి వరకూ రసవత్తరంగా సాగుతున్నాయి. భారీ స్కోరు చేసినా గెలుస్తామనే నమ్మకం చివరి వరకూ జట్లకు రావడం లేదు. -
సగం IPL పూర్తి.. బాదుడు నుంచి ఫ్లైయింగ్ కిస్ వరకు... ఆసక్తికర విశేషాలివే!
సుదీర్ఘమైన ఐపీఎల్ టోర్నీలో సగం మ్యాచ్‌లు ముగిశాయి. అనూహ్యంగా కొన్ని జట్లు చెలరేగగా.. మరికొన్ని డీలా పడిపోయి పాయింట్ల పట్టికలో అడుగుకు చేరాయి. -
అంపైర్‌గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
వీరుడొచ్చాడు.. సన్‌రైజర్స్‌కు దొరికిన మరో వార్నర్
సన్‌రైజర్స్ హైదరాబాద్ అంటే ఒకప్పుడు డేవిడ్ వార్నర్ (David Warner) మెరుపులే గుర్తుకొచ్చేవి. వార్నర్ వెళ్లిపోయిన తర్వాత ఆ లోటు కనిపించింది. ఓపెనింగ్‌లో ఓ ఖాళీ. రెండు సీజన్ల పాటు ఆ వెలితి అలాగే ఉంది. కానీ ఇప్పుడొక వీరుడొచ్చాడు. అతనే.. ట్రావిస్ హెడ్ (Travis Head). -
పరుగులివ్వడు.. వికెట్లు వదలడు... బెంబేలెత్తిస్తున్న బుమ్రా
ఐపీఎల్లో అదరగొడుతున్న బౌలర్ల జాబితా రాస్తే తొలి స్థానంలో కనిపించే పేరు జస్ప్రీత్ బుమ్రా. అతని బౌలింగ్‌లో ఆడటానికి బ్యాటర్లు బాగా ఇబ్బందిపడుతున్నారు. -
వీళ్లు ఆడితే మామూలుగా ఉండదు!
ఐపీఎల్.. ఈ టోర్నీ పేరు చెప్పగానే వెస్టిండీస్ ఆటగాళ్లే గుర్తొస్తారు. గత 16 ఏళ్లుగా కరీబియన్ ఆటగాళ్ల విన్యాసాలే అభిమానుల మనసుల్లో మెదులుతాయి. ఎందుకంటే తమ ఆటతోనే కాదు తమ హవభావాలతో మైదానంలో, మైదానం బయట ఈ విండీస్ వీరుల సందడి అంతాఇంతా కాదు. -
‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్’.. సత్తా చాటేందుకు విదేశీ సంచలనాల తహతహ
ఐపీఎల్లో తమ సత్తా నిరూపించుకోవడానికి ఆటగాళ్లు ఎదురు చూస్తుంటారు. ఫామ్‌ను అందుకోవడంతోపాటు ఫ్రాంచైజీ దృష్టిలో పడాలనేది కొందరి ఆశ. -
నితీశ్ రెడ్డి.. భారత్ క్రికెట్‌కు మరో పేస్ ఆల్‌రౌండర్ లభించినట్లేనా?
హైదరాబాద్ తరఫున మరో ఆణిముత్యం వంటి ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. అదీనూ తెలుగు కుర్రాడు కావడం ఇక్కడ విశేషం. జట్టును గెలిపించే ప్రదర్శన చేయడం అభిమానులను ఆకట్టుకుంది. -
ఫామ్‌తో తంటాలా.. ఆర్సీబీ ఉందిగా!
ఈ ఐపీఎల్ సీజన్లో బెంగళూరుపై ఫామ్‌లో లేని ఆటగాళ్లు కూడా చెలరేగుతున్నారు. అంతేకాదు వారే మ్యాచ్ విన్నర్లుగా అవతరిస్తున్నారు. -
అప్పుడు వేస్ట్.. ఇప్పుడు బెస్ట్... ‘విఫల’ ముద్ర తొలగించుకున్న బ్యాటర్లు
ఐపీఎల్లో ఇప్పటివరకు సరిగ్గా ఆడని కొంతమంది ప్లేయర్లు ఈ సీజన్ ఐపీఎల్లో అదరగొట్టేస్తున్నారు. వాళ్లెవరు, వాళ్ల సంగతేంటో చూద్దాం! -
యశ్ ఠాకూర్.. ధోనీలా మారదామని వచ్చి.. పేసర్‌గా అదరగొట్టి!
లఖ్‌నవూ పేస్ బౌలర్లు పెను సంచలనంగా మారారు. ఇదివరకు మయాంక్ యాదవ్ తన ఫాస్ట్‌తో బెంబేలెత్తించగా.. తాజాగా యశ్ ఠాకూర్ అదరగొట్టాడు. -
వద్దనుకున్నవాడే వరమయ్యాడు.. ఎవరీ శశాంక్ సింగ్..?
తన అద్భుత బ్యాటింగ్‌తో గుజరాత్‌పై పంజాబ్‌కు విజయం అందించిన శశాంక్ సింగ్‌పై ఇప్పుడు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ఓరి‘నరైనో’.. బ్యాటుతో రెచ్చిపోతున్న విండీస్ స్పిన్నర్
ప్రత్యర్థి సొంత మైదానాల్లో దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టడం అతడి ప్రత్యేకత. గత సీజన్లో పెద్దగా ప్రభావం చూపని ఈ కోల్‌కతా ఆటగాడు మళ్లీ బ్యాట్‌తో అదరగొట్టేస్తున్నాడు. -
వింటేజ్ ధోనీ... కీపింగ్ మెరుపులు ఓవైపు... భారీ సిక్సర్లు మరోవైపు!
తొలి రెండు మ్యాచుల్లో బ్యాటింగ్‌కి రాని ధోనీ... మూడో మ్యాచులో బరిలోకి దిగి భారీ సిక్సర్లు బాదాడు. దీంతో ఇప్పుడు అంతా అతని మేనియానే కనిపిస్తోంది. -
పంత్.. ఇదే కావాలయ్యా...రిషబ్ ఇక రెచ్చిపో!
రిషభ్ పంత్ జట్టులో ఉంటే అదో ధైర్యం. మనది కాదనుకున్న మ్యాచ్‌ను అమాంతం మనవైపు తిప్పేస్తుంటాడు. యాక్సిడెంట్ తర్వాత రీఎంట్రీలో చెన్నై మీద అదరగొట్టాడు. -
రేటెక్కువ.. ఆట తక్కువ... ఐపీఎల్లో ఎప్పుడూ ఇదే కథ!
భారీ ధరపెట్టి జట్టులోకి తీసుకున్న స్టార్ ప్లేయర్లు ఐపీఎల్లో నిరాశపరుస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. -
కొత్త పేస్ స్టార్.. గాయాలు ఇబ్బంది పెట్టినా బెదరని మయాంక్ యాదవ్
ఐపీఎల్ ప్లాట్‌ఫామ్ ద్వారా మరో ఆణిముత్యం వెలుగులోకి వచ్చింది. కొత్త స్టార్ పేసర్‌పై భారత సెలక్టర్లు దృష్టి పెట్టే అవకాశం లేకపోలేదు..
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా