Asia Cup Hockey 2022: డ్రాగా ముగిసిన భారత్‌ X పాకిస్థాన్‌ మ్యాచ్‌

క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూసిన భారత్‌, పాకిస్థాన్‌ మధ్య హాకీ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.......

Updated : 23 May 2022 19:32 IST

జకార్తా: క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూసిన భారత్‌, పాకిస్థాన్‌ మధ్య హాకీ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. హాకీ ఆసియా కప్‌లో దాయాది దేశాల మద్య సాగిన పోరు 1-1  గోల్స్‌తో డ్రా అయ్యింది. మ్యాచ్‌ ఆసాంతం భారత్‌ ఆధిపత్యం ప్రదర్శించగా.. చివర్లో పాక్‌ ఓ గోల్‌ చేసి ఓటమిని తప్పించుకుంది. మ్యాచ్‌ ప్రారంభం అయిన మొదటి క్వార్టర్‌లోనే భారత ఆటగాడు కార్తీ సెల్వమ్‌ అద్భుత గోల్‌ చేశాడు. ఆ తర్వాత రెండు క్వార్టర్లలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడినప్పటికీ ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. చివరిదైన నాలుగో క్వార్టర్‌లో పాక్‌కు పెనాల్టీ కార్నర్‌ లభించగా దాన్ని అబ్దుల్‌ రాణా సద్వినియోగం చేసుకున్నాడు. దీంతో స్కోర్లు సమంగా నిలిచాయి. ఈ ఏడాది జరుగుతున్న సిరీస్‌లో ఇదే తొలి మ్యాచ్‌. ఈ రెండు జట్లూ ఆసియా కప్‌ను మూడేసి సార్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని