Diego Maradona: అస్సాంలో మారడోనా చేతి గడియారం స్వాధీనం.. వ్యక్తి అరెస్టు

గతంలో దుబాయ్‌లో చోరీకి గురైన ఫుట్ బాల్‌ దిగ్గజం డీగో మారడోనా చేతి గడియారం అస్సాం రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర దొరికిందని పోలీసులు తెలిపారు. శనివారం తెలవారుజామున అతడిని..

Published : 11 Dec 2021 15:04 IST

ఇంటర్నెట్ డెస్క్: గతంలో దుబాయ్‌లో చోరీకి గురైన ఫుట్ బాల్‌ దిగ్గజం డీగో మారడోనా చేతి గడియారం అస్సాం రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర దొరికిందని పోలీసులు తెలిపారు. శనివారం తెలవారుజామున అతడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్‌లోని ఓ మ్యూజియంలో భద్రపరిచిన డీగో మారడోనా చేతి గడియారం చోరీకి గురయింది. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించిన దుబాయ్‌ పోలీసులు.. అక్కడ సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్న అస్సాం రాష్ట్రానికి చెందిన వాజిద్‌ హుస్సేన్‌తో పాటు పలువురు అనుమానితులను విచారించి వదిలేశారు. వెంటనే స్వదేశం వెళితే అనుమానం వస్తుందన్న ఆలోచనతో హుస్సేన్‌ కొన్నాళ్లు అక్కడే పని చేశాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదనే కారణం చెప్పి అస్సాంలోని తన స్వస్థలానికి వచ్చేశాడు. అతడిపై అనుమానంతో దుబాయ్‌ పోలీసులు.. భారత పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన డీజీపీ భాస్కర్‌ జ్యోతి మహంత.. పోలీసు బృందంతో కలిసి అనుమానితుడి ఇంట్లో శనివారం తెలవారుజాము సోదాలు నిర్వహించారు. మారడోనా చేతి గడియారాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇరుదేశాల పోలీసుల పరస్పర సహకారంతోనే విజయవంతంగా ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని