surya kumar yadav: బుడ్డోడే.. ఆటలో నిన్ను మించిపోయాడు: నెటిజన్ల ట్రోలింగ్‌

దక్షిణాఫ్రికా ఫాస్ట్‌ బౌలర్‌ వెర్నాన్‌ ఫిలాండర్ తాజాగా చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది

Published : 27 Sep 2022 01:46 IST

దిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 సిరీస్‌లో ఆరు వికెట్ల తేడాతో ఆసీస్‌పై భారత జట్టు గెలుపొందింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను అంతా ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఈ ఆటగాడిని అభినందిస్తూ దక్షిణాఫ్రికా ఫాస్ట్‌ బౌలర్‌ వెర్నాన్‌ ఫిలాండర్ తాజాగా చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. 

‘‘ఈ బుడ్డోడు బాగా ఆడగలడు. మ్యాచ్‌ ఎంతో ఆసక్తికరంగా ఉంది’’ అంటూ పోస్ట్‌ చేశాడు. అయితే ఇందులో సూర్యకుమార్‌ను ‘కిడ్’అనడంతో అభిమానులు ట్రోలింగ్‌కు దిగారు. సరదా కామెంట్లతో ఈ పోస్ట్‌కు బదులిస్తున్నారు. ‘ఈ 32 ఏళ్ల చంటోడు నీకన్నా ఐదేళ్లే చిన్నోడు’ అని ఒకరు కామెంట్‌ చేశారు. ‘ఇప్పుడతను పిల్లాడు కాదు ఆటలో నిన్ను మించిపోయాడు’ అని మరొకరు సమాధానం ఇచ్చారు. ‘అతడు అంతర్జాతీయ మ్యాచ్‌కు కొత్త కావచ్చు క్రికెట్‌కు కాదు’ అంటూ ఈ సీనియర్‌ ఆటగాడిని ట్యాగ్‌ చేస్తున్నారు. అభినందించడానికే అయినా ఇందులో అతడు వాడిన పదం సరైంది కాదని నెటిజన్లు ఈ ట్వీట్‌పై పెదవి విరుస్తున్నారు. ఇప్పటివరకు 31 టీ20ల్లో ఆడిన సూర్య.. హైదరాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 36 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో సత్తా చాటాడు. 69 పరుగులు చేసి ‘మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచాడు. 

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని