భారత్‌లో వార్మప్‌ మ్యాచ్‌లు అర్థరహితం

భారత్‌లో వార్మప్‌ మ్యాచ్‌లు ఆడడం అర్థరహితమని ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ అన్నాడు

Published : 01 Feb 2023 02:40 IST

సిడ్నీ: భారత్‌లో వార్మప్‌ మ్యాచ్‌లు ఆడడం అర్థరహితమని ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ అన్నాడు. భారత్‌తో ఫిబ్రవరి 9న ఆరంభం కానున్న నాలుగు టెస్టుల సిరీస్‌కు ముందు ఒక్క టూర్‌ మ్యాచ్‌ కూడా ఆడకపోవడంపై ఆస్ట్రేలియాను ఆ జట్టు మాజీలు విమర్శిస్తున్న నేపథ్యంలో స్మిత్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘సాధారణంగా ఇంగ్లాండ్‌ పర్యటనలో మా జట్టు కనీసం రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడుతుంది. గతంలో భారత్‌లోనూ టూర్‌ మ్యాచ్‌లు ఆడాం. కానీ ఈసారి ఆడట్లేదు. గతంలో ఇక్కడ టూర్‌ మ్యాచ్‌ ఆడినప్పుడు పచ్చిక ఉన్న పిచ్‌ను తయారు చేశారు. టెస్టు మ్యాచ్‌ల్లో మాత్రం స్పిన్‌ పిచ్‌లపై ఆడాం. అందుకే భారత్‌లో వార్మప్‌ మ్యాచ్‌లు ఆడడం అర్థరహితం. ఆ మ్యాచ్‌లు ఆడకూడదని సరైన నిర్ణయమే తీసుకున్నాం. నేరుగా బరిలో దిగడమే మేలు. అందుకే స్పిన్నర్లతో సొంతగా సాధన చేసుకుంటున్నాం. భారత్‌లో ఆడడం పెద్ద సవాల్‌. ఇక్కడ రెండుసార్లు పర్యటించా కానీ జట్టు సిరీస్‌ గెలవలేదు. ఈసారి పోరాడతాం’’ అని స్మిత్‌ పేర్కొన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు