2023 Cricket World Cup: ఇదేం డీఆర్‌ఎస్‌?

ప్రపంచకప్‌లో నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్‌ఎస్‌)పై విమర్శలు వస్తున్నాయి. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కోలా సమీక్ష నిర్ణయాలు వస్తున్నాయని సామాజిక మాధ్యమాల్లో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 16 Oct 2023 07:56 IST

అహ్మదాబాద్‌: ప్రపంచకప్‌లో నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్‌ఎస్‌)(DRS)పై విమర్శలు వస్తున్నాయి. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కోలా సమీక్ష నిర్ణయాలు వస్తున్నాయని సామాజిక మాధ్యమాల్లో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌- పాక్‌ మ్యాచ్‌లో మహమ్మద్‌ రిజ్వాన్‌ ఎల్బీ నుంచి తప్పించుకోవడం, ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో స్మిత్‌ బలైపోవడాన్ని పోల్చుతూ డీఆర్‌ఎస్‌ను తప్పుబడుతున్నారు. శనివారం మ్యాచ్‌లో జడేజా వేసిన 14వ ఓవర్లో రెండో బంతిని రిజ్వాన్‌ అడ్డంగా ఆడాడు. దీంతో బంతి ప్యాడ్లకు తాకడంతో అంపైర్‌ ఔటిచ్చాడు. కానీ దీనిపై రిజ్వాన్‌ సమీక్ష కోరడంతో పరిశీలించిన మూడో అంపైర్‌.. బంతి లెగ్‌స్టంప్‌ పక్కనుంచి వెళ్తుందని ట్రాకర్‌ చూపడంతో నాటౌట్‌గా ప్రకటించాడు. అంతకంటే ముందు దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో రబాడ బౌలింగ్‌లో స్మిత్‌ ఇలాగే ఎల్బీగా వెనుదిరిగాడు. అప్పుడు మైదానంలోని అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించగా.. దక్షిణాఫ్రికా సమీక్ష కోరింది. బంతి పడ్డ కోణం చూస్తే అది స్టంప్‌ను తాకదనే అనిపించింది. కానీ ట్రాకర్‌ మాత్రం ఆశ్చర్యకరంగా బంతి లెగ్‌ స్టంప్‌ను తాకుతుందని చూపింది. దీంతో నమ్మశక్యం కానట్లుగా స్మిత్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. పై రెండు సందర్భాల్లో బంతి కోణం ఒకేలా కనిపించినా.. ట్రాకర్‌ మాత్రం భిన్నమైన ఫలితాలు చూపడంతో డీఆర్‌ఎస్‌ సాంకేతికతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని