Shubham Dubey: ఐపీఎల్‌ డబ్బుతో ఇళ్లు కొంటా

ఐపీఎల్‌ ద్వారా వచ్చే డబ్బుతో తన కుటుంబం కోసం ఇళ్లు కొంటానని యువ బ్యాటర్‌ శుభమ్‌ దూబె అన్నాడు. విదర్భకు చెందిన ఈ కుర్రాడిని మినీ వేలంలో రాజస్థాన్‌ రాయల్స్‌ ఏకంగా రూ.5.60 కోట్లకు సొంతం చేసుకున్న నేపథ్యంలో శుభమ్‌ ఇలా వ్యాఖ్యానించాడు.

Updated : 28 Dec 2023 08:04 IST

జైపుర్‌: ఐపీఎల్‌ ద్వారా వచ్చే డబ్బుతో తన కుటుంబం కోసం ఇళ్లు కొంటానని యువ బ్యాటర్‌ శుభమ్‌ దూబె (Shubham Dubey) అన్నాడు. విదర్భకు చెందిన ఈ కుర్రాడిని మినీ వేలంలో రాజస్థాన్‌ రాయల్స్‌ ఏకంగా రూ.5.60 కోట్లకు సొంతం చేసుకున్న నేపథ్యంలో శుభమ్‌ ఇలా వ్యాఖ్యానించాడు. ‘‘ఒకప్పుడు మా కుటుంబానికి కనీసం క్రికెట్‌ కిట్‌ కొనిచ్చే పరిస్థితి ఉండేది కాదు. కానీ నాన్న కష్టపడి కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాళ్లు ఎప్పుడూ నాపై ఒత్తిడి తీసుకురాలేదు. పాన్‌షాప్‌ నడుపుతూ నాన్న చాలా కష్టపడ్డారు. ఆ తర్వాత హోటల్‌లో మేనేజర్‌గా ఎదిగారు. ఇప్పుడు నేను వాళ్లకు సంతోషం కలిగించాలి. అందుకే మొదట ఒక ఇళ్లు కొంటున్నా’’ అని దూబె పేర్కొన్నాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ప్రధాన కోచ్‌ కుమార సంగక్కరను కలుసుకోవాలని ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లు శుభమ్‌ తెలిపాడు. ‘‘సంగ సార్‌ కెరీర్‌ను రిటైర్‌ అయ్యేదాకా అనుసరించా. ఆయన అపార అనుభవజ్ఞుడు. అతడి నుంచి ఎంతో నేర్చుకోవాలనుకుంటున్నా’’ అని శుభమ్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని