Ashes Series: ఫాస్ట్‌ బౌలర్.. స్పిన్నర్‌గా అవతారమెత్తి..

ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే/నైట్‌ (పింక్‌బాల్‌) టెస్టులో ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ ఓలీ రాబిన్‌సన్‌ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అతడు సహజంగా ఫాస్ట్‌బౌలర్‌ కాగా...

Published : 20 Dec 2021 01:16 IST

అడిలైడ్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే/నైట్‌ (పింక్‌బాల్‌) టెస్టులో ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ ఓలీ రాబిన్‌సన్‌ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అతడు సహజంగా ఫాస్ట్‌బౌలర్‌ కాగా, ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఆదివారం ఒక ఓవర్‌ స్పిన్‌ బౌలింగ్‌ చేసి షాకిచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోను అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పంచుకొని సరదాగా నవ్వుకుంటున్నారు. నాలుగో రోజు ఆటలో ఆస్ట్రేలియా 79/4 స్కోర్‌తో కొనసాగుతున్న వేళ ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ బంతిని రాబిన్‌సన్‌కు అందించాడు. అయితే, అతడు ఫాస్ట్‌ బౌలింగ్‌ చేయకుండా ఆఫ్‌స్పిన్‌ బంతులు వేశాడు. దీంతో ఒక్కసారిగా జట్టులోని ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. చివరికి అతడు రెండు పరుగులే ఇచ్చి ఆ ఓవర్‌ను ముగించాడు. మీరూ ఆ వీడియోను చూసి ఎంజాయ్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని